తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ద్వితీయ మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో పశ్యపద్మ
సభల వివరాలు వెల్లడ
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ద్వితీయ మహాసభలు జులై 1, 2, 3 తేదీల్లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని అమృత ఎస్టేట్‌లో తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం రాష్ర్ట కార్యాలయంలో సోమవారం పేద రైతు సర్వవోలు నారాయణతో కలిసి పశ్య పద్మ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ జులై 1వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో రైతు మహాసభను పురస్కరించుకొని రైతుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని చెప్పా రు. జులై 2వ తేదీన మహాసభలు ప్రారంభమౌతాయని, ఈ సభకు ఎఐకెఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల వెంకయ్య, అతుల్ కుమార్ అంజాన్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సభలను ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ అంజాన్ ప్రారంభిస్తారని, 3వ తేదీన రైతులకు పంటల బీమా ఆవశ్యకత, ప్రభుత్వ పథకాల అమలుపై సెమినార్ జరుగుతుందని, ఈ సెమినార్‌లో మాజీ ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త ఇక్రిసాట్ డా॥ కిలారు పూర్ణచందర్, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, డీన్, ప్రొఫెసర్ ఎం.వి.రమణమూర్తి, మాజీ ప్రధాన జన్యుశాస్త్రం శాస్త్రవేత్త, ఐసిఎఆర్ డాక్టర్ సోము మర్ల హాజరవుతున్నారు. రాష్ర్ట నలుమూలల నుండి ప్రతినిధు లు, సౌహార్థ ప్రతినిధులు హాజరవుతారన్నారు. కౌలు, పాల, మహిళా రైతులు పాల్గొంటున్నారని పశ్య పద్మ తెలిపారు. వ్యవసాయ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగి పోవడంతో ఖర్చులు మొత్తాన్ని రాబట్టు కోలేని దుస్థితి ఏర్పడిందని, పంటలు పండించిన రైతులకు కనీసం సాగు ఖర్చులు, -కుటుంబ పోషణ ఖర్చులు లభించక మార్కెట్ మాయాజాలంపై పోరు సాగిస్తున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని, సాగును చిన్న,- సన్న-, మధ్యతరగతి రైతుల, కౌలు రైతుల నుండి తీసుకొని మార్కెట్లను, పంపిణీని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ఆలోచనతో 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. దీంతో ఆగ్రహించిన లక్షలాది మంది రైతులు సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని, అన్ని పంటలకు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం శాస్త్రీయమైన గ్యారెంటీతో కూడిన మద్దతు ధరలు చెల్లించాలని, ఢిల్లీ సరిహద్దులలో ఏడాదిన్నర కాలం పైగా తీవ్రమైన అనిచివేతను ఎదుర్కొని మడమ తిప్పని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులలో రైతాంగం సాగించిన పోరాటాల స్ఫూర్తితో ఐక్యంగా రైతాంగం పాలకుల వాగ్దానాల అమలుకు పోరాటం చేయాల్సి ఉందన్నార
సాగు ఖర్చులు పెరగడంతో పెట్టుబడి రాని దుస్థితి
RELATED ARTICLES