రెండు ఎంఎల్‌సి ఎన్నికల నేపథ్యంలో చర్చ
ప్రజాపక్షం / హైదరాబాద్ నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి ఎప్పుడు ఉప ఎన్నిక జరగనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఉప ఎన్ని క షెడ్యూలు ఎపిలోని తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు వస్తుందా? లేదా రెండు, మూడు నెలల తరువాత వస్తుందా? అనే అంశం ఆసక్తి రేపుతోం ది. టిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో సాగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో నిబంధనల ప్రకారం ఆరు నెల ల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నోముల డిసెంబర్ 1వ తేదీన మరణించడంతో జూన్ 1వ తేదీలోగా ఎప్పుడైనా ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితు ల నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరగనుందనే అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుబ్బా క ఉప ఎన్నికలో గెలుపు, జిహెచ్‌ఎంసిలో మెరుగైన ఫలితాలు సాధించిన బిజెపి తెలంగాణలో పుంజుకోవాలనే ఉత్సాహంతో ఉంది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీని ఇచ్చింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చాటుకునేందుకు రెండు నెలల్లో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలు, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిం ది. ఈ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించి తమ పట్టును పెంచుకోవాలని బిజెపి భావిస్తోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం ప్రస్తుతం బిజెపి ఖా తాలో ఉండగా, మరో నియోజకవర్గమైన నల్లగొం డ, ఖమ్మం, వరంగల్ స్థానంలో గత ఎన్నికల్లో బిజెపి రెండవ స్థానంలో నిలిచింది. దీంతో పాత స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మరో స్థానా న్ని గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న ది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లకు బిజెపి ముఖ్య నాయకులు వరుస పర్యటనలు చేస్తూ, ఇతర పార్టీల నుండి చేరికలపై దృష్టి సారించారు.
ఎంఎల్‌సి ఎన్నికలు అడ్డొస్తాయా?
అయితే, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బిజెపికి కొంత ఇబ్బందికరంగా ఉండబోతుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ స్థానం నుండి బిజెపికి కేవలం 2,700 ఓట్లు మాత్రమే సాధించింది. ఆ స్థానంలో సంస్థాగతంగా కూడా పెద్ద పట్టులేదు. ఇక్కడ ఎన్నికలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నడుమే అనే వాతావరణం ఇప్పటికే నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు ప్రత్నామ్యాయం కాంగ్రెస్ కాదని, బిజెపినే పోటీ ఇస్తుందనే వాదనకు బ్రేక్ పడే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. ఆ ప్రభావం ఎంఎల్‌సి, ఇతర మున్సిపల్ ఎన్నికలపై పడితే బిజెపి ఎదుగుదలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలా కాకుండా ఈ ఎన్నికలు పూర్తయ్యాక సాగర్ ఉప ఎన్నిక జరిగితే తమకు లాభం చేకూరుతుందని బిజెపి శ్రేణుల్లో ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉప ఎన్నిక ఇప్పట్లో జరుగుతాయా, తరువాత జరుగుతాయా అనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. గత ఏడాది సిఎం కుమార్తె, టిఆర్‌ఎస్ మాజీ ఎంపి కవిత పోటీ చేసిన నిజామాబాద్ స్థానిక సంస్థ ఎంఎల్‌సి ఉప ఎన్నికలు నామినేషన్‌లు వేశాక రెండు మార్లు పోలింగ్ వాయిదా పడింది. అక్కడ తాము గెలిచే అవకాశం ఉండడంతో కావాలనే పోలింగ్ వాయిదా పడ్డాయని టిఆర్‌ఎస్ నేతలు అంతర్గతంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలు జరిగే రెండు స్థానాలు దాదాపు సగం రాష్ట్రం పరిధిలో ఉండడంతో ఎన్నికల కమిషన్ యంత్రాంగం దానిపైనే దృష్టి సారిస్తోంది. పైగా ఉప ఎన్నిక జరగాల్సిన నాగార్జునసాగర్ కూడా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎంఎల్‌సి నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఈ కారణమేమైనా సాగర్ ఉప ఎన్నిక ఆలస్యమయ్యేందుకు కారణమవుతుందా? అనే అనుమానాలు కూడా కొనసాగుతున్నాయి. ఎంఎల్‌సి ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరగున్నాయి. ఒకవేళ అంతకుముందు ఉప ఎన్నిక జరగకపోతే, ఏప్రిల్, మే నెలలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటే నాగార్జునసాగర్ ఎన్నికకు షెడ్యూలు విడుదల చేస్తారా? అనే చర్చ సాగుతోంది.
‘సాగర్’ ఉప ఎన్నిక జాప్యం?
RELATED ARTICLES