ప్రజాపక్షం / నల్లగొండ ప్రతినిధి
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు జిల్లా అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉప ఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గత నెల 17న ఎన్నికలు జరగగా, 346 కేంద్రాల్లో 86.8 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జిల్లా కేంద్రంలో ఆర్జాలబావి, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూము ఓపెన్ చేసి, ఇవిఎంలను కౌంటింగ్ హాల్‌కు తరలిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించి, 8 గంటలకు ఇవిఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌కు 2 హాల్‌లో 14 ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేస్తారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానున్నది. కౌంటింగ్‌కు ప్రతి టేపతి ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్‌తో పాటు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొత్తం 400 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఎన్నికల సంఘం గైడ్‌లెన్స్ నిబంధనల ప్రకారం కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లు, సిబ్బంది, పోలీసు సిబ్బందితో పాటు జర్నలిస్టులను కూడా కొవిడ్ టెస్టులు నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారినే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తున్నారు. ఏజెంట్లకు పిపిఇ కిట్లు అందజేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రానికి ప్రతి మూడు గంటలకొకసారి శానిటైజర్ చేస్తూ ప్రతి ఒక్కరికీ మాస్కులు తప్పనిసరి చేశారు. మూడు దఫాలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కూడా ఇచ్చి శనివారం మాక్ కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకులు సజ్జన్ సింగ్ ఆర్ చహాన్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌ఒ రోహిత్ సింగ్, ఆర్‌డిఓ జగదీశ్వర్‌రెడ్డిలు కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ హాల్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, 300 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు.
‘సాగర్’ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధ్దం
RELATED ARTICLES