నిండు కుండలా సాగర్ జలాశయం
గేట్ల పై నుండి దూకుతున్న నీరు
స్పిల్‌వే మీదుగా కృష్ణమ్మ సొగసిరి
వరద ప్రవాహం పెరిగితేనే గేట్లు ఎత్తే అవకాశం
నల్లగొండ : నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండలా మారింది. రేడియల్ క్రస్ట్ గేట్ల మీదుగా తెల్లని దవలకాంతులను వెదజల్లుతూ అళలు అళలుగా కృష్ణమ్మ స్సిల్‌వే మీదుగా దూకి దిగువకు నెమ్మదిగా జారుతూ సొగసిరిని ఆరబోస్తోంది. శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 590.6 అడుగులకు చేరింది. ఎగువ నుండి 70 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు సమాచారం.ఈ ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటితే సాగర్ డ్యాం గేట్లు ఎత్తే అవకాశం లేకపోలేదు. ప్రాజెక్టు నుండి ప్రస్తుతం దిగువకు 54 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి వరద రాక తగ్గినా బ్యాక్ వాటర్ కారణంగా మట్టపల్లి దేవాలయం గర్భగుడిలోకి నీరు చేరింది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టులో రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న సాగర్‌కు నీటిని వదులుతున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఎగువ నుండి వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటితే ఎప్పుడైనా సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం నుండి సాగర్‌కు 72 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా సాగర్ నుండి 53 వేల 600 క్యూసెక్కుల నీరు కాల్వలు, విద్యుత్ కేంద్రం నుండి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం లోపలి నుండి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండగా..ఒడ్డున చేరిన పర్యాటకులు అలల సవ్వడిని వింటూ తనివితీరా జలాశయాన్ని చూ స్తున్నారు.జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, 312.0450 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 590.06 అడుగులకు చేరింది. ప్రధాన డ్యామ్ మీద నుండి దిగువకు చేయి చాపితే అందుకునేంత నిండుగా సాగర్ నీటిమట్టం ఉం ది. అధికారులు లాంచీలు నడుపుతుండటం తో పర్యాటకులు నాగార్జునకొండను సందర్శిస్తున్నా రు.దిగువనున్న పులిచింతల జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తు తం 42 టిఎంసిలకు చేరుకుంది. పై నుండి ఇన్ ఫ్లో వస్తుండగా నీటిని కిందకు విడుదల చేస్తున్నా రు. పులిచింతల ప్రాజెక్టు వరద ఉధృతి అధికమవ్వడంతో పవర్‌ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. పవర్ ప్లాంట్‌లో సాంకేతిక సమ స్య రావడంతో ఉత్పత్తి నిలివేసినట్లు తెలిసింది. దీంతో సాగర్ కుడి, ఎడమ కాల్వల రైతు లు వరినాట్లు వేసుకునేందుకు సిద్ద్ధమవుతున్నారు. ఇప్పటికే నారుమళ్లు పోసుకున్న రైతులు ఎడమ కాల్వ నీటిని విడుదల చేస్తూ ఆయకట్టు రైతులు ముమ్మరంగా వరినార్లు వేసుకునే అవకాశం ఉం ది. అదేవిధంగా ఎస్‌ఎల్‌బిసి కాల్వ ద్వారా పిఎపల్లి, పెద్దవూర, గుర్రంపూడ్, చండూర్, కనగల్, నల్లగొండ, వేములపల్లి, తిప్పర్తి, కట్టంగూర్, తదితర మండలాల్లో చెరువులను నింపి సాగు, తాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. పానగల్‌లోని ఉదయ సముద్రా న్ని పూర్తిస్థాయిలో నింపినట్లుతై ప్రజలకు సాగునీటి సమస్య భవిష్యత్‌లో ఉండదని అధికారులు భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెద్దగావర్షా లు కురువకపోయినప్పటికీ ఎగువ నుండి వరద నీరు రావడంతో సాగర్ జలాశయం నిండుకుండ ను తలపిస్తోంది.దీంతో జిల్లా ప్రజలకు తాగు, సా గునీరు సమస్య ఉండదని ప్రజలు భావిస్తున్నారు.
సాగరం
RELATED ARTICLES