ప్రగతికి సూచికగా నిలవాలి
అయోధ్య అభివృద్ధిపై ప్రధాని మోడీ అభిలాష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను అన్ని విధాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. అయోధ్యలో నిర్మించబోయే అయోధ్యలో నిర్మించిబోయే రామమందిరానికి ప్రత్యేకత ఉండాలని ఆయన అన్నారు. అయోధ్యను సంప్రదాయ విలువలకు అద్దం పట్టేదిగా, ప్రగతికి సూచిక గా తీర్చిదిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయోధ్య అభివృద్ధిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాని శనివారం సమీక్షించారు. దృశ్య మాధ్య మం ద్వారా జరిగిన ఈ సమీక్షలో యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అయోధ్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన టౌన్‌షిప్, టూరిజం బోర్డు, విమానాశ్రయం, సరయూ నదీ తీర ప్రాంత అభివృద్ధి, రామాలయం నిర్మాణం, రామాలయం నుంచి రోడ్డు వరకు అనుసంధానం వంటి ఎన్నో విషయాలను, వివరాలను ఇందులో పొందుపరిచారు. అయోధ్య సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలు, అమలు చేయాల్సిన వ్యూహాలు, చర్యలపై బ్లూ ప్రింట్ కూడా ఇందులో ఉంది. దీనికి సంబంధించిన విజయన్ డాక్యుమెంట్లను తయారు చేసే బాధ్యతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే ఎల్‌ఇఎ అసోసియేట్స్ సౌత్ ఆసియా సంస్థకు అప్పచెప్పింది. ఆ సంస్థ ఇచ్చిన ప్రణాళికలను అనుసరించి అయోధ్య సమగ్రాభివృద్ధికి 27 ప్రాజెక్టులను చేపట్టడం అవసరం. వీటిలో 10 ప్రాజెక్టులకు సంబంధించిన సవివరమైన నివేదికలను త్వరలోనే విడుదల చేస్తారు. అయోధ్యను దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి 100 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించనున్నారు. అయోధ్య విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.321 కోట్లును ఇది వరకే విడుదల చేసింది. ఈ విమానాశ్రయాన్ని మర్యాదా పురుషోత్తమ్ శ్రీరామ్‌గా పిలువనున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం అదనంగా 555.66 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.1,001.77 కోట్ల బడ్జెట్‌ను యుపి సర్కారు కేటాయించింది. కేంద్రం రూ.250 కోట్లు విడుదల చేసింది. అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతోపాటు టూరిస్టు అట్రాక్షన్‌గా తీర్చిదిద్దేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లూ ప్రింట్‌కు మోడీ ఆమోదముద్ర పడనుందని తెలుస్తోంది.
సాంప్రదాయ విలువలకు అద్దం పట్టాలి
RELATED ARTICLES