HomeNewsBreaking Newsసహచరులపై బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ కాల్పులు

సహచరులపై బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ కాల్పులు

ఐదుగురు జవాన్లు మృత్యువాత
అమృత్‌సర్‌లోని బిఎస్‌ఎఫ్‌ శిబిరంలో దుర్ఘటన
అమృత్‌సర్‌ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న బిఎస్‌ఎఫ్‌ శిబిరంలో దారుణం చోటు చేసుకుంది. సరిహద్దు భద్రతా దళానికి చెందిన (బిఎస్‌ఎఫ్‌) ఓ జవాన్‌ తోటి సిబ్బందిపై ఆదివారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కాల్పుల జరిపిన జవాన్‌ సహా మొత్తం ఐదుగురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భారత్‌ అంతర్జాతీయ ఫ్రంట్‌ వెంబడి అట్టారి సరిహద్దు క్రాసింగ్‌కు దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్‌సర్‌ ఖాసా ప్రాంతంలో ఉన్న 144వ బెటాలియన్‌కు చెందిన శిబిరంలో ఉదయం 9.30 గంటల మధ్య ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో నిందితుడు కానిస్టేబుల్‌ సత్తెప్ప ఎస్‌కె. కూడా మృతి చెందినట్లు ఒక అధికారి చెప్పారు. అయితే నిందితుడైన జవాన్‌ తనకు తానుగా కాల్చుకున్నాడా లేక తోటి జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడా అనేది స్పష్టం కాలేదు. ఘటన జరిగిన తీరు అంతా అస్పష్టంగా ఉందని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. నిందితుడు తన డ్యూటీ గంటలపై కలత చెందినట్లుగా కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు. శిబిరంలో నిలిపి ఉంచిన రెండవ కమాండ్‌ ర్యాంక్‌ అధికారి వాహనంపై కూడా కాల్పులు జరిపాడాన్నారు. పంజాబ్‌ బిఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆసిఫ్‌ జలాల్‌ మీడియాతో మాట్లాడుతూ శిబిరంలో ఎలాంటి శతృత్వంగానీ, డ్యూటీకి సంబంధించిన సమస్యలు గానీ లేవని చెప్పారు. అనారోగ్యం బాగాలేదని సత్తెప్ప శనివారం రాత్రి సమీప ఆసుపత్రి చేరాడు. ఆదివారం ఉదయం అనారోగ్యం కుదుటపడిందని డాక్టర్ల చెప్పారని, డిశ్చార్జ్‌ చేస్తామన్నట్లు సమచారం అందించారని ఐజి చెప్పారు. అయితే ఆసుపత్రి నుంచి వచ్చీ రాగానే ఆయుధశాల నుంచి తన ఆయుధాన్ని తీసుకొని విచక్షణారిహతంగా తోటి జవాన్లపై కాల్పులు చేశాడన్నారు. ఘటనపై పోలీసులు, బిఎస్‌ఎఫ్‌ దళం దర్యాప్తు జరుపుతోందన్నారు. కాగా, అమృత్‌సర్‌లోని బిఎస్‌ఎఫ్‌ శిబిరంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం దురదృష్ట ఘటన అని బిఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి అభివర్ణించారు. గాయపడిన మరో జవాన్‌ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చామన్నారు. బాధితులంతా కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌ ర్యాంకు గల వారన్నారు. నిజా నిజాలు తెలుసుకునేందుకు కోర్టు ఆఫ్‌ ఎంక్వైరీకి ఆదేశించామన్నారు. సత్తెప్ప కుటుంబ సభ్యులతో పోన్‌ ద్వారా మాట్లాడామని, వారి కుటుంబ సమ్యలను అర్థం చేసుకున్నామన్నారు. మృతి చెందిన వారిలో నిందితుడు కనిస్టేబుల్‌ సత్తెప్ప (కర్నాటక), హెడ్‌ కానిస్టేబుల్‌ రామ్‌ బినోద్‌ (బీహార్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ టోరస్కర్‌ డిఎస్‌ (మహారాష్ట్ర), హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌ సింగ్‌ (జమ్మూకశ్మీర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ బాల్‌జిందర్‌ కుమార్‌ (హర్యానా పనిపట్‌)ల ఉన్నట్లు అమృత్‌సర్‌ సీనియర్‌ ఎస్‌పి దీపక్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, ఘటన సమచారం అందిన వెంటనే సరిహద్దు దళం సీనియర్‌ అధికారులు, పంజాబ్‌ పోలీసులు హుటాహుటిన బిఎస్‌ఎఫ్‌ శిబిరానికి తరలి వచ్చినట్లు అధికారులు వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments