ప్రజాపక్షం/భద్రాచలం ; భద్రాచలం సహకార సంఘంలో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం భవిష్యత్ గందరగోళం కావడంతో దానికి అనుసంధానంగా ఉన్న అన్ని శాఖలు అధ్వాన్నంగా మారాయి. ఇందులో సహకార సంఘం కూడా దెబ్బతిన్నది. అంతా పోను భద్రాచలం సహకార సంఘం పరిధిలో కేవలం 120 ఎకరాల భూమి మాత్రమే మిగులుంది. కేవ లం 40 మంది మాత్రమే ఓటర్లున్నారు. మరో ప్రక్క జిల్లాలోని వేరే ప్రాంతాల్లో భూమి ఉండి, ఇక్కడి సంఘ పరిధిలో నివాసం ఉంటూ సభ్య త్వం కలిగిన వారు కూడా ఓటు కల్పించడంతోపాటు పోటీలో పనిచేసే అర్హత పొందారు. ఉన్న 40 మంది సభ్యుల్లో 11 మంది దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో భూములున్నాయి.
అన్నీ ఆ రోజే : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర సంఘాల్లో గురువారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కానీ భద్రాచలం సంఘంలో మాత్రం ఈనెల 15వ తేదీ నాడు అన్ని ప్రక్రియలు ఏక కాలంలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు ఈ 40 మంది ఓటర్లకు గానూ కనీసం 30 మంది హాజరు తప్పనిసరీ. వీరిలో ఏ ఒక్కరు తగ్గినా ఎన్నిక రద్దయినట్లే. అక్కడికి వచ్చిన వారి నుండే నామినేషన్లు తీసుకోవడంతో పాటు నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ ఉంటాయి. చేతులెత్తే విధానం ద్వారా డైరెక్టర్ల ఎంపికను పూర్తి చేస్తారు. మొత్తంగా 13మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్‌టి డైరెక్టర్‌కు అభ్యర్థి లేకపోవడంతో 12 మంది మాత్రమే పోటీలో ఉండనున్నారు. ఓటర్లు తక్కువగా ఉండటంతో ప్రతీ డైరెక్టర్ ఎంపికకు చేతులెత్తే విధానం ఉండటంతో ఓటర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. చేతులేత్తే విధానంలో ఓటింగ్ బహిర్గతం కానుందని, ఎవరికి ఓటు వేసామో తెలిసిపోతుందని, దీంతో తలనొప్పు కాయమని అంతా భావిస్తున్నారు. దీనిని రద్దు చేసి సీక్రెట్ బ్యాలెటు ఉంటే మేలని భావిస్తున్నారు. కానీ సొసైటీ పరిధిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మూలంగా చేతులెత్తే విధానం తప్పని సరీ అని తెలుస్తోంది.
సహకార విచిత్రం
RELATED ARTICLES