హైదరాబాద్ : రాష్ట్రంలోని 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (డిసిసిబి), డిసిఎంఎస్‌లను టిఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా పిం గళి రమేష్ ఎన్నికయ్యారు. అదే విధంగా డిసిఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా గొంగిడి మహేందదర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎ.సి.రెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికకాగా, జిల్లా డిసిఎంఎస్ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదే విధంగా డిసిఎంఎస్ చైర్మన్‌గా సాంబారి మోహన్, వైస్ చైర్మన్‌గా ఏదుల్లా ఇంద్రాసేనా రెడ్డి ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా నాందేవ్ కాంబ్లే, వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి ఎన్నికయ్యారు. డిసిఎంఎస్ చైర్మన్‌గా తిప్పని లింగ య్య, వైస్ చైర్మన్‌గా కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్‌గా బి.మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య ఎన్నికయ్యారు. డిసిఎంఎస్ చైర్మన్‌గా కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్‌గా మధుకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం, డిసిఎంఎస్ చైర్మన్‌గా శివకుమార్, వైస్ చైర్మన్‌గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్‌గా కురాకుల నాగభూషణం,వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. డిసిఎంఎస్ చైర్మన్‌గా రాయల వెంకటశేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా నిజాం పాషా, వైస్ చైర్మన్‌గా వెంకటయ్య, డిసిఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యానాయక్ ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్‌గా మార్నేని రవీందర్, వైఎస్ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. డిసిఎంఎస్ చైర్మన్‌గా గుగులోతు రామస్వామినాయక్, వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు.
రంగారెడ్డి డిసిసిబి చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం
ఏకగ్రీవంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కె.సత్తయ్యలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జనార్దన్ ప్రమాణస్వీకారం చేయించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బ్యాంకు కార్యాలయంలో జరిగిన కార్యాక్రమంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎంఎల్‌సిలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రభాకర్‌రావు, ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు అభినందించారు. జిల్లా మంత్రులు, ఎంఎల్‌ఎలు తనపై నమ్మకంతో చైర్మన్‌గా నియమించినందుకు మనోహర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న రైతులకు న్యాయం చేసే విధంగా పనిచేస్తానని ఆయన అన్నారు.
సహకారంలో టిఆర్‌ఎస్ మద్దతుదారులదే గెలుపు
RELATED ARTICLES