ధరణిలో ‘ఆస్తులు, భూముల’ విలువ
సబ్ రిజిస్ట్రార్‌తో చర్చించిన తర్వాతనే అంచనా
సర్వే పూర్తయ్యాకే ‘విలువ’ కట్టాలె
మున్సిపల్ కమిసనర్లకు సర్కార్ ఆదేశం
రికార్డుల్లో లేని ఆస్తులు, భూములకు యజమానుల నుంచి ‘స్వీయ ధృవీకరణ పత్రం’
ప్రజాపక్షం/హైదరాబాద్ వ్యవసాయ,వ్యవసాయేతర భూములు, ఆస్తు ల ప్రాథమిక విలువను ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలని పురపాలికలకు ప్రభుత్వం ఆదేశించింది. స్థలాలు,ఆస్తుల ప్రాథమిక విలువను అంచనా వేసేందుకు స్థానిక ‘సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్‌ఆర్‌ఒ)’ సహకారం తీసుకోవాలని సర్కార్ సూచించింది. సర్వే ద్వారా సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా విలువలను అంచనా వేయనున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో అన్ని ఆస్తులు, భూముల సమాచారాన్ని సేకరించేందుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన విలువను కూడా పొందుపర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్వేలో వెల్లడైన సమాచారం ఆధారంగా ఆస్తులు, భూముల విలువను కూడా బహిర్గతం చేయనున్నారు. ప్రధానంగా రెవెన్యూ వార్డులు, బ్లాక్‌ల వారీగా సమాచారాన్ని పొందుపర్చనున్నారు. సర్వేకు నిర్దేశించిన కాలపరిమితిలోపే సర్వేను పూర్తి చేయడంతో పాటు అదనంగా వ్యవసాయ,వ్యవసాయేతర ఆస్తులు, భూములకు విలువను నిర్ధారించాల్సి ఉంటుందని పురపాలిక శాఖ స్థానిక పురపాలికలను ఆదేశించింది. భూములు,ఆస్తులకు విలువ అంచనా వేసే క్రమంలో తప్పులు, ఇతర సమస్యలు కూడా రాకుండా చూడాలని సూచించినట్టు తెలిసింది.
రికార్డుల్లో లేని ఆస్తుల కోసం ప్రత్యేకంగా ‘ఎన్‌పిబి’ దరఖాస్తు
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో భాగంగా భూమి,ఆస్తులకు సంబంధించి సమాచారం ప్రభుత్వ రికార్డుల్లో లేకపోయినా సదరు యజమానికి నుంచి ‘స్వీయ ధృవీకరణ పత్రం’ తీసుకోవాలని మున్సిపల్ శాఖ స్థానిక పురపాలికలను ఆదేశించింది. కాగా వ్యవసాయేతర ఆస్తులు, భూములకు సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా ఎన్‌పిబి దరఖాస్తును నింపాలని కూడా మున్సిపల్‌శాఖ సూచించింది. అయితే ఇలాంటి ఆస్తుల విషయంలో భూమి, ఆస్తులకు సంబంధించిన విస్తీర్ణం, భవనాల లెక్క చెప్పే విషయంలో కొలతలు తీసుకోవద్దని, యజమని ఇచ్చే స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా వివరాలను పొందుపర్చాలని కూడా స్పష్టం చేసింది. మొత్తానికి ఒక ఇంచు స్థలాన్ని కూడా మినహాయింపు ఇవ్వరాదని, భూమికి, ఆస్తులకు సంబంధించిన సమగ్ర సమాచారం మ్యాప్‌లో ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
సర్వే తర్వాతనే… భూ విలువ
RELATED ARTICLES