నేడే జిఎస్‌టి మండలి కీలక సమావేశం
మినహాయింపులపై పెరుగుతున్న ఆశలు
న్యూఢిల్లీ: కొవిడ్ విజృంభణతో అతలాకుతలమైన దాదాపు అన్ని వర్గాలు శుక్రవారం జరిగే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) మండలి కీలక సమావే శం తీరుతెన్నులు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. మినహాయింపులపై అందరిలోనూ ఆశలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆరోగ్య రంగం పలు రాయితీలు లేదా మినహాయింపులను కోరుతున్నది. కొవిడ్ వ్యాక్సిన్లపై జిఎస్‌టిని తగ్గించాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జిఎస్‌టి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కొవిడ్ వ్యాక్సిన్లతో పాటు దీనికి సంబంధించిన మందులు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, టెస్టింగ్ కిట్స్ తదితర పరికరాలపై జిఎస్‌టిని రద్దు చేయాలన్న డిమాండ్ ఉంది. అయితే, కొంత మేరకు తగ్గిస్తారా? లేదా పూర్తిగా మాఫీ చేస్తారా? అనేది చూడాలి. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న కారణంగా, వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తిచేస్తే క్రమంలో టీకాలపై పన్ను అంశం కూడా ప్రధాన అజెండాలో భాగం కానుంది. దీంతో పాటు ప్రాసెస్డ్ ఆహారం, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, మెడికల్ గ్రేడ్ పరికరాలపై జిఎస్‌టి తగ్గింపు అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలో చేర్చే అంశం కూడా చర్చకు వస్తుందని అంటున్నారు. కరొనా టీకాలతోపాటు పలు వస్తువులపై జిఎస్‌టిని తొలగించాలని పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. అయితే జిఎస్‌టిని మాఫీ చేస్తే ఆయా వస్తువుల ధరలు పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే చెప్పారు. అంటే, ప్రస్తుతానికి జిఎస్‌టి మాఫీ ఉండకపోవచ్చన్నది కొందరి వాదన. వ్యాక్సిన్లను జిఎస్‌టి నుంచి పూర్తిగా మినహాయిస్తే, దేశీయ తయారీదారులు ముడిపదార్ధాలు, సేవలకు చెల్లించిన పన్నులను తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలు పెంచుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అదే జరిగితే, వినియోగదారులపై భారం పడుతుంది. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి, పూర్తిగా మినహాయింపు ఇవ్వకుండా కొవిడ్ వ్యాకిన్లు, ఔషధాలు, సంబంధిత వస్తువులను సున్నా శ్లాబులో చేరిస్తే సరిపోతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 0.1శాతం కనీస పన్ను విధిస్తే, తయారీదారులు ఇన్‌పుట్ ట్యాక్స్ రిఫండ్‌కు వీలుంటుంది. మొత్తం మీద వ్యాక్సిన్లు, ఇతర ప్రా ధాన్యతా వస్తువులపై జిఎస్‌టి తగ్గింపు లేదా మినహాయింపు ప్రధాన అంశంగా శుక్రవారం నాటి సమావేశం కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్న ది. ప్రస్తుతం వ్యాక్సిన్లపై ఐదు శాతం, కొవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై 12శాతం జిఎస్‌టి విధిస్తున్నారు. కాగా, జిఎస్‌టిలో శ్లాబులను తగ్గిం చే అంశంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, జిఎస్‌టి మండలి సమావేశంలో అసలు ఈ అంశంపై ఆలోచించే అవకాశాలు లేవని అంటున్నారు. అదే విధంగా పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టిలో చేర్చే విషయంలో కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనలను గుర్తు చేసుకోవాలి. విమానాలకు వాడే జెట్ ఫ్యూషల్, నేచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన లేదని ఇప్పటికే తేల్చిచెప్పింది. కాబట్టి, పెట్రో ఉత్పత్తుల విషయంలో ఆశాజనమైన నిర్ణయాన్ని ఊహించడానకి వీల్లేదు. కాబట్టి, కొవిడ్ సంక్షోభం దృష్ట్యా ప్రస్తుతానికి వ్యాక్సిన్లు, మందులు, వైద్య సంబంధమైన పరికరాలపై పన్ను అంశాలనే పరిగణనలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదిఏమైనా, అన్నివర్గాల వారు ఎంతో ఆసక్తిగానూ, ఆశగానూ ఎదురుచూస్తున్న జిఎస్‌టి మండలి సమావేశం ఏం తేలుస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దీనిపై సస్పెన్స్ కొనసాగుతునే ఉంది.
సర్వత్రా ఉత్కంఠ
RELATED ARTICLES