నేటి నుంచి 18 వరకూ సిపిఐ జాతీయ మహాసభలు
దేశదేశాల నుంచి తరలివస్తున్న ప్రతినిధులు
అరుణశోభ సంతరించుకున్న విజయవాడ
విజయవాడ నుండి బొమ్మగాని కిరణ్‌కుమార్
భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి మహోన్నత యోధులను అందించిన చారిత్రక విజయవాడ నగరం సిపిఐ జాతీయ మహాసభలకు సర్వ సిద్ధమైంది. నగరంలో ఎటు చూసినా సిపిఐ తోరణాలు, జెండాల రెప రెపలు, హోర్డింగ్‌లతో కళ కళలాడుతోంది. దేశ వ్యాప్తంగా బెజవాడకు వస్తున్న వివిధ రాష్ట్రాల సిపిఐ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ వివిధ కూడళ్ళను అరుణ శోభితం చేశారు.ఐదు రోజుల పాటు జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభం కానున్నాయి. మహాసభ ప్రారంభ సూచికగా శుక్రవారం నాడు భారీ ర్యాలీ, బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ జరిగే మాకినేని బసవపున్నయ్య స్టేడియంకు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం ‘కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు (సిఆర్) మైదాన్’గా నామకరణం చేశారు. విజయవాడ కేదారేశ్వరిపేట ఫ్రూట్స్ మార్కెట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రదర్శన ప్రారంభం కానుంది. 24వ జాతీయ మహాసభకు సూచికగా 24 అరుణ పతాకాలను చేబూని జనసేవాదళ్ వాలంటీర్‌లు కవాతు చేయనున్నారు. వారిని అనుసరించి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే కమ్యూనిస్టు కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శన నిర్వహిస్తారు. సుమారు రెండు కిలోమీటర్లు మేరకు సాగే మహా ప్రదర్శన జిఎస్ రాజు రోడ్డు, గవర్న్‌మెంట్ ప్రెస్ సెంటర్, అజిత్ సింగ్ నగర్ ఫ్లు ఓవర్ , డాబా కొట్ల సెంటర్‌ల మీదుగా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు మైదాన్ వరకు ప్రదర్శన సాగనుంది. అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు.
బహిరంగ సభ వేదిక వెనుక భారీ ఎల్‌ఇడి తెర: కామ్రేడ్ సిఆర్ మైదానంలో జరిగే బహిరంగ సభకు గురువారమంతా ఏర్పాట్లు చురుకుగా సాగాయి. బహిరంగ సభాస్థలి ఇన్‌ఛార్జ్, మాజీ ఎంఎల్‌సి జల్లి విల్సన్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. సుమారు 20వేల కుర్చీలను సభికుల కోసం వేసారు. అలాగే బహిరంగ సభ వెనుక ఎల్‌ఇడి తెర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆ తెరపై కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలతో పాటు, సభలో వక్తల ప్రసంగాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ఆధునిక సౌండ్ సిస్టమ్, చీకటి పడినా ఇబ్బంది రాకుండా ఫ్లడ్ లైట్‌లను ఏర్పాటు చేసారు.
బహిరంగ సభ వక్తలు వీరే : సిపిఐ ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పార్లమెంటరీ పార్టీ నాయకులు బినోయ్ విశ్వం, జాతీయ కార్యదర్శులు అమర్‌జీత్ కౌర్, డాక్టర్ కె.నారాయణలు ప్రసంగిస్తారు. అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎపి రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణ మూర్తి సందేశాలిస్తారు.
రెండు రోజుల క్రితమే తరలివిచ్చిన సెంట్రల్ ఆఫీస్ జాతీయ మహాసభ నేపథ్యంలో రెండు రోజుల ముందు ఢిల్లీ నుండి సిపిఐ సెంట్రల్ ఆఫీసు విజయవాడకు తరలివచ్చింది. హనుమాన్‌పేట లోని దాసరి నాగభూషణరావు భవన్‌లో ఆఫీసును కేంద్రంగా చేసుకున్నారు. మరో వైపు బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులు గురువారమే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో ఎక్కడ చూసిన సిపిఐ ప్రతినిధులు, కార్యకర్తలు, మహాసభ ఏర్పాట్లతో కోలాహలంగా మారింది. వివిధ దేశాల విదేశీ ప్రతినిధులు రాక బుధవారం నుండే ప్రారంభమైంది.
తెలంగాణ నుండి 20 వేల మంది
వరంగల్ నుండి ప్రత్యేక రైలుకు జెండా ఊపనున్న కూనంనేని
విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభ సందర్భంగా జరిగే బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రం నుండి భారీగా సిపిఐ శ్రేణులు తరలివెళ్తున్నాయి. వరంగల్ నుండి విజయవాడకు ప్రదర్శకులు వెళ్ళేందుకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును శుక్రవారం ఉదయం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉదయం 8 గంటలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు.ఈ రైలులో సుమారు 5 వేల మంది వెళ్లేందుకు రైల్వే శాఖ అనుమతించింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 10వేలకు పైగా తరలి వెళ్ళేందుకు 400 బస్సులలో శుక్రవారం బయలుదేరనున్నాయి. ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుండి సైతం ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. మరోవైపు తమిళనాడు, పాండిచ్ఛేరి, కేరళ రాష్ట్రాల నుండి కూడా కమ్యూనిస్టు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శుక్రవారం జరిగే మహా ప్రజా ప్రదర్శనకు బస్సులు, రైళ్ళు, ఇతర రవాణా వాహనాల ద్వారా పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు వేలాదిగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు కేటాయించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా స్వతంత్రంగా వివిధ వాహనాల్లో గురువారం రాత్రికే విజయవాడ నగరానికి చేరుకున్నారు.జరిగే మాకినేని బసవపున్నయ్య స్టేడియంకు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం ‘కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు (సిఆర్) మైదాన్’గా నామకరణం చేశారు. విజయవాడ కేదారేశ్వరిపేట ఫ్రూట్స్ మార్కెట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రదర్శన ప్రారంభం కానుంది. 24వ జాతీయ మహాసభకు సూచికగా 24 అరుణ పతాకాలను చేబూని జనసేవాదళ్ వాలంటీర్‌లు కవాతు చేయనున్నారు. వారిని అనుసరించి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే కమ్యూనిస్టు కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శన నిర్వహిస్తారు. సుమారు రెండు కిలోమీటర్లు మేరకు సాగే మహా ప్రదర్శన జిఎస్ రాజు రోడ్డు, గవర్న్‌మెంట్ ప్రెస్ సెంటర్, అజిత్ సింగ్ నగర్ ఫ్లు ఓవర్ , డాబా కొట్ల సెంటర్‌ల మీదుగా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు మైదాన్ వరకు ప్రదర్శన సాగనుంది. అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సర్వం సిద్ధం
RELATED ARTICLES