ముంబయి ప్లేయర్ అరుదైన ఘనత
ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్
ముంబయి : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబయి ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వాంఖడే వేదికగా ఉత్తరప్రదేశ్‌తో బుధవారం ముగిసిన రంజీ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ముంబయి తరఫున ఈ ఘనతనందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. దీంతో సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబయి తరఫున ట్రిపుల్ సెంచరీలు సాధించగా.. తాజాగా సర్ఫరాజ్ ఈ ఫీట్ సాధించి వారి సరసన చేరాడు. సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ ఓవరాల్‌గా ముంబై తరఫున 8వది కాగా.. వసీం జాఫర్ రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. చివరికి ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. కెరీర్లో సర్ఫరాజ్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు. ఆదివారం మొదలైన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరప్రదేశ్ 159.3 ఓవర్లలో 625/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఉపేంద్ర యాదవ్ (239 బంతుల్లో 27ఫోర్లు, 3 సిక్సర్లతో 203) డబుల్ సెంచరీ సాధించగా.. అక్షదీప్ నాథ్ (217 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై 128 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. అజేయ ట్రిపుల్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. సిద్దేశ్ లా్డ (174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 98), ఆదిత్య తారె (144 బంతుల్లో 14 ఫోర్లతో 97) సెంచరీలు చేజార్చుకున్న అండగా నిలిచారు. దీంతో ఆ జట్టు 166.3 ఓవర్లలో 688/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇక సర్ఫరాజ్ తన మాజీ జట్టుపైనే ట్రిపుల్ సెంచరీ సాధించడం విశేషం. ముంబైకి చెందిన సర్ఫరాజ్ గతంతో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడాడు. 2015లో ఉత్తర్ ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్.. తన ప్రస్తుత టీమ్ ముంబయిపై ఇదే వాంఖడే వేదికగా 47 పరుగులు చేశాడు. ముంబయి తరఫున ఆడేందుకు మరో అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు సర్ఫరాజ్ ఖాన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘చాలా రోజుల తర్వాత సెంచరీ చేశా. ముంబై తరఫున తొలి సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది’అని మంగళవారం సెంచరీ పూర్తున అనంతరం సర్ఫరాజ్ తెలిపాడు. ఇక ఉత్తర్ ప్రదేశ్ తరఫున ఆడటం తన నాన్న, కోచ్ నౌషద్ ఖాన్ నిర్ణయమని ఈ 22 ఏళ్ల క్రికెటర్ తెలిపాడు. ‘ముంబై జట్టును వదిలి యూపీకి వెళ్తున్నప్పటి క్షణాలు నాకింకా గుర్తున్నాయి. ముంబై నాకున్న ప్రేమతో నా కళ్లేంట నీళ్లు వచ్చాయి. మళ్లెప్పుడు ముంబయి తరఫున ఆడుతాననుకోలేదు. ముంబయి తరఫున ఆడుతున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఒక కలలా ఉంది. కాగా, ఇతను ఇండియా క్యాష్ రిచ్ లీగ్ ఐపిఎల్.. 2015 సీజన్లోనే సర్ఫరాజ్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌కు ఎంపికయ్యాడు. ఆ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లని అద్భుత షాట్లతో ఎదుర్కొని అలరించాడు. భారీ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత 2016 అండర్-19 ప్రపంచకప్ో్ల భారత్ ఫైనల్ చేరడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ యువ హిట్టర్.. ఆ ఏడాది ఐపిఎల్‌లో రాణించాడు. కానీ.. ఫిట్నెస్ లేమి కారణంగా అతని కెరీర్ గాడి తప్పింది. అతను విఫలమైనప్పుడల్లా బొద్దుగా ఉండడాన్ని విమర్శకులు టార్గెట్ చేశారు. దీంతో అతను అవకాశాలు అందుకోలేకపోయాడు.
సర్ఫరాజ్ ఖాన్ త్రిపుల్ సెంచరీ
RELATED ARTICLES