కేవలం మరిన్ని వివరాలు కావాలని అడుగుతున్నా : శామ్ పిట్రోడా
న్యూఢిల్లీ: ‘భారత వాయుసేన ఈ మధ్య పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడిలో వాస్తవికత ఎంత?’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహాదారు శామ్ పిట్రోడా ప్రశ్నించారు. ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా కూడా ఉన్నా రు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఆంగ్ల వార్తా సంస్థ ఎఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ ‘వారు 300 మందిని చంపితే మంచిదే. కాకపోతే నేను అడిగేది ఒక్కటే.. దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు, వాస్తవాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను న్యూయార్క్ టైమ్స్, ఇతర పత్రికలు చదివాను. అసలు మనం దాడి చేశామా..? 300 మందిని చంపామా..?నాకైతే తెలియదు. ఒక పౌరుడిగా నాకు అడిగే హక్కు ఉంది.. నేను అడుగుతాను. అంతమాత్రాన నేను ఇటు వైపో..అటు వైపో ఉన్నట్లు కాదు. మనకు మరిన్ని నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు 300 మందిని చంపితే భారత ప్రజలకు తెలుసుకొనే హక్కు ఉంది.
సర్జికల్ స్ట్రుక్ జరిగిందా?
RELATED ARTICLES