ప్రభుత్వ బడులకు పెరుగుతున్న ఆదరణ
కరోనా వల్ల ప్రైవేట్‌లో చదువులు చెప్పకున్నా భారీగా ఫీజుల వసూళ్లు
దిక్కుతోచక ప్రభుత్వ బడివైపు అడుగులు
ఈ విద్యా సంవత్సరం సర్కార్ స్కూళ్లలో భారీగా చేరికలు
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో కరోనా మహమ్మారి విజృంభణతో 16 మాసా ల పాటు మూతబడిన విద్యాసంస్థలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన విషయం విధితమే. విద్యాసంస్థలు ప్రారంభమై పక్షం రోజు లు అవుతున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు నేటికీ వెనుకాడుతున్నా రు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్న వారు అనేక మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువులు చెప్పించలేక తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ బడుల నుండి విద్యార్థులు అధికంగా ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కరోనా కాలంలో ఆన్‌లైన్ ద్వారా చదువులు సరిగా చెప్పకున్నా ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు భారీగా ఫీజులు వసూ లు చేయడమే. ఫలితంగా సర్కార్ బడుల్లో ఈ విద్యా సంవత్సరం చేరికలు భారీగా పెరిగా యి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 1166 పాఠశాలలు ఉండగా, ఇందులో 909 ప్రభుత్వ, 257 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల పరిధిలో మొ త్తం 1,27,572 విద్యార్థినీ, విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్ 1న విద్యాసంస్థలు ప్రారంభమైన నాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం అధికంగా ఉండగా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మొదటి నుండి అంతంత మాత్రమే. కరోనా తగ్గుముఖం పట్టక ముందే ప్రభుత్వం విద్యాసంస్థలను తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై 50 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా, 50 శాతం మంది వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. బడులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. ఫీజులను నిర్ణయించకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల వారు ఇదే అదునుగా తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూళ్లు చేయడం మొదలు పెట్టారు. కరోనాతో పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా చితికిపోయారు. బతకడమే భారంగా మారింది. దీనికి తోడు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని తట్టుకోలేకపోతున్నారు. కరోనా ముందు వరకు కాయకష్టం చేసి తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్‌లో చదివించిన తల్లిదండ్రులు. నేడు అక్కడికి పంపలేక సర్కార్ బడుల్లో తమ పిల్లలను చేరిక చేస్తున్నారు. ప్రభుత్వం నెలనెలా ట్యూషన్ ఫీజులే వసూళ్ళు చేయాలని చెప్పినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు నర్సరీకి కూడా రూ. 15 వేల నుండి 30వేల వరకు వసూళ్ళు చేస్తుండగా పైతరగతులుకు రూ. 30వేల నుండి మొదలుకుని లక్ష వరకు ముక్కుపిండి వసూళ్ళు చేస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అధికంగా ఉంది.
ఈ విద్యా సంవత్సరం సర్కార్ బడుల్లో భారీగా చేరికలు
సర్కార్ బడి ముఖం చూసేందుకు ఇష్టపడని పేద, మధ్యతరగతి వారు ఈ విద్యా సంవత్సరం తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేరిక చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడులు కిటకిటలాడుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా 63,258 మంది విద్యార్థులకు గాను 39,508 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ లెక్క ప్రకారం 62.42శాతం కాగా ఎయిడెడ్ పాఠశాలలో 2013 మంది విద్యార్థుకు గాను 725 మంది విద్యార్థులు మాత్రమే ప్రత్యేక బోధన జరుగుతుంది. దీనిని బట్టి విద్యార్థుల హాజరు శాతం 36.02 మాత్రమే. ప్రైవేట్ విద్యాసంస్థల్లో మొత్తం 62,270 మంది విద్యార్థులకు గాను 23,272 మంది హాజరు అవుతున్నారు. వీరి హాజరు శాతం 49.78 మాత్రమే ఉంది. సర్కార్ బడులంటే చిన్న చూపు చూసిన వారంతా నేడు కరోనా పుణ్యమా అని తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తుండటంతో విద్యార్థులతో కలకలలాడుతున్నాయి.
సర్కార్‌కు సై… ప్రైవేట్‌కు నై!
RELATED ARTICLES