దేశంలో ఇంటింటా దుర్భర పరిస్థితులు
పేద అతలాకుతలం
న్యూఢిల్లీ : ఉక్రేన్ సంక్షోభ నేపథ్యంలో దేశంలో ప్రజల జీవన పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. కాశీ నుండి కన్యాకుమారి వరకూ,సిక్కిం నుండి గుజరాత్ వరకూ ధరల పెరుగుదలతో ప్రజల జీవనం దుర్భరంగా మారిపోయింది. ఐదురాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం జూలు విదిల్చింది. ఒక్కసారిగా అన్ని వైపుల నుండి ధరలు సామాన్య ప్రజలపై దాడి చేయడంతో దిక్కుతోచని పరిస్థిల్లోకి ప్రజలు దిగజారిపోయారు. నెలవారి ఇంటి నిర్వహణ, జీతం ఖర్చులను సర్దుబాటు చేసుకోవడం, అప్పు లేకుండా ఇల్లు గడడానికి ప్రయత్నం చేయడం పేద, మధ్యతరగతి గృహిణులకు పెద్ద సవాలుగా మారిపోయింది. ద్రవ్యోల్బణం పెరుగుదలతో 500 నోటు మారిస్తే చాలు ఈదురు గాలికి ఎగిరిపోయిట్లు డబ్బు చేతుల్లోంచి మాయమైపోతోంది. ముఖ్యంగా కూరగాయల ధరలు విపరీతగా పెరిగిపోయాయి. అనేక ఆహార వస్తువులు కూడా అందనంత ఎత్తులో ఉండి కంటి కనిపిస్తూ ఊరిస్తూ ఉండటంతో ప్రజలు నోరూ కట్టడి చేసుకుని బతుకుతున్నారు. నెలవారీ ఖర్చులు, నెలవారీ జీతాన్ని వివిధ అవసరాల నిమిత్తం ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదల ఇక చెప్పాలిసన అవసరమే లేదు. ఇప్పటివరూ పెట్రోలు లీటరుకు పది రూపాయలు, డీజిలు లీటరుకు పది రూపాయలు అదనంగా పెరిగాయి. వంట గ్యాస్ ధర కూడా వెయ్యి రూపాయలను టచ్ చేసింది. గడచిన నెలరోజులుగా మార్కెట్‌లో ధరలు వేసవి ఎండలతో పోటీపడుతూ చుర్రుమంటూ ఉండటంతో పేద,మధ్యతరగతి,రోజువారీ కూలివర్గం అప్పులపైన, అడ్వాన్సులపైనా ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొద్దోగొప్పో దాచుకున్న ఐదూ, పదివేల రూపాయలు కూడా ఖర్చుపెట్టుకుని చేతులు దులుపుకుంటున్నారు. పెట్రోలు, డీజిలు ధరలు రోజువారీ ప్రాతిపదికపై పెగడంతోటే సామాన్య ప్రజాజీవనం అతలాకుతలమైపోయింది. ఎల్‌పిజి వంటగ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000 లుగా ఉంది. పండ్లు,కూరగాయలు,వంటనూనె ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. యుద్ధం పేరు వినబడగానే కరోనా అనుభవాలనే గుర్తుచేసుకుని కొంతమంది మధ్యతరగతి వేతన జీవులు ముందుగానే వంటనూనె నిల్వలు చేసుకున్నప్పటికీ ఆ వైభోగం కూడా కేవలం రెండు నెలలు మాత్రమే అని వాపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బతుకు భారంగా మారిందని పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాకు చెందిన హోంమేకర్ అనుదీప్ కౌర్ గొరాయా అన్నారు. హర్యానా హిస్సార్‌కు చెందిన వ్యాపార ఓంపాల్ సింగ్ కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆటో మార్కెట్‌లో ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరుగుతూ ఉండటంవల్ల కరెన్సీ విలువ తగ్గిపోయిందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం వల్ల చిరు వ్యాపారులు, ట్రేడర్లు తీవ్రగా నష్టపోతున్నారని ఓంపాల్ సింగ్ అన్నారు. కేరళలో చేపలు విక్రయంచే వీధి వ్యాపారి, మధ్యప్రదేశ్‌లో ఒక పాల వ్యాపారీ కూడా పెరుగుతున్న ధరలబారిన పడినవారే. వారికి పాలు పోసినందుకు ఖాతాదారులు డబ్బులు చెల్లించడం లేదు. నాగాలు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి చేతుల్లో డబ్బులు ఆడటం లేదు. వ్యాపారం కొనసాగించేందుకు భారీ వడ్డీలతో మార్కెట్‌లో అప్పులకు ఎగబడుతున్నారు. భోపాల్‌కు చెందిన పాల వ్యాపారి కల్లూ రామ్ (50) ది కూడా అదే పరిసస్థితి. భారీగా పెట్రోలు ధరలు పెంచడంవల్ల రోజూ ఉదయమే తన వాహనంలో పెట్రోలు పోయించడానికి అతగాడు బెంబేలెత్తుతున్నాడు. పాలు అమ్మడం ద్వారా రోజువారీ పొదుపు చేసుకునే కొద్దోగొప్పో సొమ్ము కాస్తా వాహనంలో పెట్రోలు పోయించడానికే సరిపోతోందని కల్లూ రామ్ వాపోతున్నారు. “ప్రతిరోజూ నా ఖాతాదారులకు పాలు పోయడానికి వెళ్ళడంకోసం నా వాహనంలో పెట్రోలు పోయించడానికి ఈ మధ్య రూ.160 లు ఖర్చుచేస్తున్నాను. ఇంతకుముందు రూ.100 లు మాత్రమే ఖర్చు చేసేవాణ్ణి. నా పొదుపు సొమ్ము తగ్గిపోతోంది. నా అవసరాలు తీరడం లేదు, రోజువారీ వడ్డీలు చెల్లించడానికి ఇబ్బంది ఏర్పడుతోంది, వెంటనే పెంచిన పెట్రోలు ధరలు తగ్గించాలి” అని కల్లూ రామ్ డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు ధరలు దేశంలో దాదాపు ప్రతిఒక్క మనిషినీ దెబ్బతీశాయని ఆయన అన్నారు. కేరళ కోజికోడ్‌లో వీధుల్లో చేపలు అమ్ముకునే ఒక చిరు వ్యాపారి అబ్దుల్ రెహ్మన్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కూడా ద్విచక్రవాహనం వాడతాడు. రోజువారీ వ్యాపారం కోసం వాహనంలో పోయించే పెట్రోలు ఖర్చు ఇప్పటివరకూ రూ.150 లు ఉంటే, గడచిన 20 రోజులుగా రోజుకి రూ.250 లు ఖర్చు అవుతోంది. “నేను 23 కిమీ ప్రయాణం చేస్తాను, పెరుమన్న నుండి పుథియ్యప్ప ఫిషింగ్ హార్బర్ వరకూ వెళతాను. వివిధ రకాల చేపలు సేకరిస్తాను. కంటైనర్‌లో వేసుకుని దాన్ని బైక్‌మీద పెట్టుకుని పుథియారా, పొట్టెమ్మల్, ఛేవయూర్, ఛేవరమబాలం ప్రాంతాల్లో తిరుగుతాను, మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి చేరుకుంటాను. నా పెట్రోలు ఖర్చు బాగా పెరిగిపోయింది,నా రోజువారీ ఖర్చుల బడ్జెట్ తారుమారైపోయింది” అని అబ్దుల్ రెహ్మన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా చండీగఢ్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి బల్‌దేవ్ చంద్ మాట్లాడుతూ, ధరల పెరుగుదల వల్ల నా ఫ్యామిలీ బడ్జెట్ ఖర్చులు తారుమారయ్యాయి, నాకు వచ్చే పెన్షన్‌లో ఎక్కువభాగం ఇప్పటికే మందులకు ఖర్చైపోతోంది,నా భార్య,నేను ఇద్దరం ప్రతిరోజూ మందులు వేసుకోవాలి. ఇద్దరి ఖర్చూ నా పెన్షన్‌లో సగం పోతుంది. ఇక మిగిలేది ఎంత? మిగిలిన ఖర్చులకు ఆ కొద్దిపాటి సొమ్మును ఎలా సర్దుబాటు చేసుకోవాలి? రోజూ వంటలోకి ఉపయోగించే కూరగాయలకే భారీగా ఎక్కువ డబ్బులుకేటాయించవలసి వస్తోంది, ఇక నేను ముఖ్యం అయినాగానీ చాలా ఖర్చులు తగ్గించేసుకున్నాను, కరంటు వాడకం తగ్గించేశాను, ఫ్యాన్ కూడా బలవంతంగా వాడటం మానేస్తున్నాను,ఖర్చులు ఆదాచేద్దామనే” అన్నారు. ఇక ఢిల్లీకి చెందిన మయూర్ విహార్ చెందిన కూరగాయల వ్యాపారి ప్రదీప్ ఖుష్వానా మాట్లాడుతూ, పెట్రోలు,డీజిలు, సిఎన్‌జి ధరల పెరుగుదల వల్ల కూరగాయల ధరలు దేశ రాజధానిలో చాలా ఖరీదైన వస్తువులుగా మారిపోయాయని అన్నారు. సిఎన్‌జి ధరలు విపరీతంగా పెంచడంవల్ల (కిలోకి రూ.10లు) ఆటో, క్యాబ్ ధరలు పెరిగిపోయాయి. క్యాబ్ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు ఈనెల 18న నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఢిల్లీ ఆటో రిక్షా సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోనీ చెప్పారు. రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఈ ఖర్చులు 10 శాతం మేరకు గణనీయంగా పెరిగాయి.“సిఎన్‌జి ని ప్రస్తుతం కిలోకి రూ.69 లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సిఎన్‌జిపై రూ.35 లు సబ్సిడీ ఇవ్వాలి. అప్పుడే మేం మనుగడ సాగించగలం,అందుకే నిరవధ ఇక సమ్మెకు పూనుకుంటున్నాం” అన్నారు సోనీ. దక్షిణ గోవాకు చెందిన రాహుల్ దేశాయ్ కూడా ఇదేవిధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మార్కెటింగ్ వృత్తిలో ఉన్నారు.తన ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, నా కారులో పెట్రోలు ఖర్చు నాలుగు నెలల క్రితం రూ3000 దాటిపోగా, ఇప్పడు ఈ ఖర్చు రూ.4000 దాటిపోయిందని ఆయన వాపోయారు.ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందిన కామిని పటేల్ కూడా కూరగాయల వ్యాపారే. పెట్రోలు ధరలు తన వ్యాపారాన్ని దెబ్బ తీశాయని ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్నారు. గతంలో తాను రూ.1500 రోజూ సంపాదించేవాడిననీ, ఇప్పుడు రూ.1000 మాత్రమే సంపాదిస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన జి.వి.రాజు మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు బతికే రోజులు లేవన్నారు.
సరుకు ప్రియం బతుకు భారం
RELATED ARTICLES