టెస్టు క్రికెట్‌కు కొత్తపుంతలు
27 సిరీస్‌లతో 71 టెస్టుమ్యాచ్‌లతో వరల్డ్ ఛాంపియన్‌షిప్
అభిమానుల కోసం ఐసిసి కొత్త ప్రణాళిక
అభినందనీయమం అంటున్న మాజీలు, క్రికెట్ విశ్లేషకులు
క్రీడా విభాగం: రెండు వందల సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ వినూత్న సమరానికి రంగం సిద్ధమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసిసి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ వినూత్న ప్రణాళికను క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌లోనే పురుడు పోసుకోబోతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక లీగ్ నిర్వహించడానికి మూడేళ్ల కార్యక్రమానికి ఐసిసి రూపకల్పన చేసింది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసిసి బోర్డు వార్షిక సమావేశంలో ఛైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ హోదా పొందిన తొమ్మిది జట్లతో టెస్ట్ క్రికెట్ లీగ్‌ను నిర్వహిస్తోంది. టెస్టుల్లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించేందుకు ఐసిసి ఈ కొత్త ప్రణాళికను ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ప్రపంచ క్రికెట్ దేశాలకు తెలియజేస్తూ సోమవారం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వన్డే, టి20 వరల్డ్ కప్ మాదిరిగా ఈ ఛాంపియన్‌షిప్ ఉండబోతోందని బోర్డు సభ్యులు తెలిపారు. ఇంగ్లాం న్యూజీలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బాంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి ప్రపంచ మేటి జట్లు తలపడే వర్క్ గ్రాండ్ మెగా ఛాంపియన్‌షిప్‌ను క్రికెట్ ఆడే అన్ని దేశాలు వేదికలు నిలువనున్నాయి. ఈ టెస్టుల్లో కొన్ని డే/నైట్ టెస్టులు కూడా ఉన్నాయి. కాగా, 27 సిరీస్‌లకుగాను 71 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి తొమ్మిది టెస్టు జట్లు. అయితే ఈ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ద్వారా లెక్కించి, ఎక్కువ పాయింట్లు సాధించిన రెండు జట్లను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించనుంది.
పాయింట్లను ఎలా పరిగణిస్తారంటే…
ఈ ఛాంపియన్ షిప్ లో ప్రతి సిరీస్ కూ 120 పాయింట్లు ఉంటాయి. ఆ సిరీస్ టెస్టు మ్యాచ్ ల సంఖ్య ను బట్టి ఒక టెస్టు కూ ఇన్నేసి పాయింట్లు కేటాయిస్తారు. ఒక టెస్టు సిరీస్‌లో కనిష్టంగా 2 మ్యాచ్‌లు గరిష్టంగా మ్యాచ్‌ల వరకు ఉంటాయి. 2 మ్యాచ్‌లు ఉన్న టెస్టు సిరీస్‌లోని ఒక మ్యాచ్‌కు 60 పాయింట్లు ఉంటాయి. అదే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు 40 పాయింట్ల చొప్పున ఉంటాయి. టైగా ముగిస్తే 50% పాయింట్లు లేదా డ్రా ముగిసిన మ్యాచ్ కు 3:1 నిష్పత్తిలో పాయింట్లను కేటాయిస్తారు. ఇలా ఒక టెస్టు సిరీస్‌లో ఎక్కువ పాయింట్లను సాధించిన జట్లను ఫైనల్లోనెల్లోకి దూసుకెళతాయి.
తొమ్మిది జట్లు..
ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా, రెండో ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్ మూడో ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ న్యూజిలాండ్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయి. ఈ ఐసీసి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఆగస్టు 1న ప్రారంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్‌తో ఐసిసి శ్రీకారం చుట్టింది. 2019 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లీగ్ జరగనుంది. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ జట్ల మధ్య జరగనున్న తొలి యాషెస్ టెస్టుతో ఈ లీగ్‌కు తెరలేవనుంది. స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరిస్‌లు టెస్టు హోదాను కలిగి ఉన్న మొత్తం 9 దేశాలు కూడా స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరిస్‌లు ఆడతాయి. ఈ సిరీస్‌ల్లో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి రెండు జట్లు ఇంగ్లాండ్‌లోని లారడ్స్ వేదికగా 2021 జూన్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇరు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌తో సంబంధం లేకుండా 120 పాయింట్లు చొప్పున ఐసిసి కేటాయించింది. దీంతో ఒక్కో జట్టుకు అత్యధికంగా 720 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమండియా తన సిరీస్‌ను కరేబియన్ పర్యటనతో ప్రారంభించనుంది.
టీమిండియా మ్యాచ్‌లు..
సోమవారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్య కాలంలో ఆసీస్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది. 2021 జనవరి-మార్చి మధ్యకాలంలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగుస్తుంది.అయితే ఈ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఈ ఆగస్టు- వెస్టిండీస్ వేదికగా 2 టెస్టులు ఆడనుంది. ఈ టెస్టుల్లో ఆడేందుకు కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు విండీస్ బయలుదేరి వెళ్లింది. ఆ తరువాత అక్టోబర్‌లో సొంత గడ్డపై సాఫారీలతో సైవాల్‌కు దిగనుంది కోహ్లీసేన. అక్కడ వారితో మూడు టెస్టుల్లో తలపడనుంది. ఆమరుసటి మాసం నవంబర్‌లో బంగ్లాదేశ్ భారత పర్యటనకు రానుంది. ఇక్కడ బంగ్లాతో 2 టెస్టులు ఆడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ దాదాపు రెండు మాసాలు పర్యటించనుంది టీమిండియా. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న కివీస్ జట్టుతో 2 టెస్టుల్లో పోటీపడనుంది. అనంతరం చాలా గ్యాప్ తీసుకొని 2020 నవంబర్‌లో అస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ సుదీర్ఘమైనటువంటి పర్యటనలో ఆసీస్‌తో నాలుగు టెస్టుల్లో తలపడనుంది. ఈ పర్యటన జనవరి 2021 వరకు కొనసాగనుంది. ఆ వెంటనే స్వదేశంలో ఇంగ్లీషు జట్టుతో హోరాహోరీకి సిద్ధం కానుంది. ఆసీస్ నుంచి తిరగి వచ్చిన కోహ్లీసేనతో ఇంగ్లాండ్ జట్టు తలపడనుంది. ఈ సుదీర్ఘమైన సిరీస్‌లో రూట్‌సేన భారత్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పోటీపడనుంది. కాగా, ఈ యాషెస్ తరువాత ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇదే పెద్ద సిరీస్ కావడం గమనార్హం. ఈ టెస్టు సిరీస్ మార్చి 2021తో ముగుస్తుంది.
సరికొత్త ‘సాంప్రదాయం’
RELATED ARTICLES