గురుగ్రామ్ (న్యూఢిల్లీ): దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంగ్ సింగ్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం తో ఆయనను ఆగస్టు 22న ఇక్కడి వేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి రెడు రోజుల క్రితం విషమించింది. ఐసియు లో ఉంచి వైద్యులు చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ములాయం తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఆయన కుమారుడు, ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, జాతీయ రాజకీయాలపైన కూడా తనదైన ముద్ర వేసిన ములాయం 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయోలో సుగర్ సింగ్ యాదవ్, మూర్తీ దేవి దంపతులకు జన్మించారు. తొలుత ఆయన మాల్తీ దేవిని వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే అఖిలేష్. ఆమె మరణించిన తర్వాత సాధన గుప్తాను ములాయం పెళ్లి చేసుకున్నారు. 1960 దశకం నుంచే రాజకీయల్లో కీలకంగా వ్యవహరించిన ములాయం తాను గురువుగా భావించే రామ్ మనోహర్ లోహియా నుంచే మెళకువలు నేర్చుకున్నారు. 1967లో జస్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి, తొలి ప్రయత్నంలోనే గెలిచారు. వివిధ పార్టీలతో కలిసి నడిచిన ఆయన 1992లో సొంతంగా సమాజ్‌వాది పార్టీని స్థాపించారు. ఆ పార్టీని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సెక్యూలర్ వాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆరు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయం, కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగానూ సేవలు అందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చివరిసారి మెయిన్‌పురి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. అక్కడి నుంచే ఆయన ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మొత్తం మీద తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన 10 పర్యాయాలు ఎంఎల్‌ఎగా, ఏడు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ములాయం మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అధికార లాంఛనాలతో ములాయం భౌతిక కాయానికి మంగళవారం ఉదయం ఆయన స్వగ్రామమైన సైఫాయోలో పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయ
సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం కన్నుమూత
RELATED ARTICLES