ఎవివి విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవంలో ఉప రాష్ట్రపతి ఉద్బోధ
ప్రజాపక్షం/వరంగల్‌బ్యూరో : నేటి సమాజంలో నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తేనే సమాజాభివృద్ధి జరుగుతుందని, ఇందుకు విశ్వవిద్యాలయాలు విద్యాసంస్థలు, అధ్యాపకులు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని ఎవివి విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ వేడుకలు విద్యాసంస్థల అధ్యక్షుడు నాగబండి నర్సింహరావు, కార్యదర్శి చంద విజయ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం ఉదయం జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదట ఎవివి విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ అంటే నాకెంతో ఇష్టమని కాకతీయ సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యా, సాహిత్య, సాంస్కృతిక వ్యవసాయక కేంద్రంగా ఓరుగల్లు ప్రభాసిల్లుతుందని ఈ జిల్లాలో దాశరథి రంగాచార్యులు, వానమామలై వరదాచార్యులు, కాళోజి సోదరులైన రామేశ్వర్‌రావు, నారాయణరావు, మాజీ ప్రధాని పివి నర్సింహరావు వంటి మహానుభావులు పుట్టిన గడ్డ అని అన్నారు. ఇక్కడి సంస్కృతి వారసత్వం చిహ్నమైన ఓరుగల్లు ఖిలా, వేయిస్తంభాలగుడి, రామప్ప, లక్నవరం, పాకాల వంటి అతిపెద్ద చెరువులతో వరంగల్ నగరానికి కంఠాభరణం లాంటివన్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న నగరం కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఓరుగల్లు స్మార్ట్‌సిటీ, హెరిటేజ్ సిటీలుగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం, నిట్, కెఎంసి, కిట్స్, కాళోజి హెల్త్ యూనివర్సిటీ అగ్రశేణి సంస్థలతో విద్యాకేంద్రంగా ఓరుగల్లు భాసిల్లుతుందన్నారు. మాజీ ప్రధాని పివి నర్సింహరావును ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దిన ఘనత ఓరుగల్లుకే దక్కిందన్నారు. నిజాం కాలంలో ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం ఉండేదని, నిజాం నవాబుని ఒప్పించి మెప్పించి మన అస్తిత్వానికి ప్రతీకైన విద్యాబోధన జరిగేందుకు 75 సంవత్సరాల క్రితమే తెలుగు భాషాభివృద్ధికి, విద్యా వ్యాప్తికి చందా కాంతయ్య ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి విద్యాసంస్థల వేడుకలకు తను హాజరుకావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1945లో ప్రారంభమైన చందా కాంతయ్య స్థాపించిన ఎవివి ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, ఎవివి డిగ్రీ పిజి కళాశాలలుగా విస్తరించి 75 ఏళ్లుగా ఓరుగల్లు ప్రజలకు విద్యనందించడం అభినందించదగ్గ విషయమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాథమిక, సెకండరీ విద్య తెలుగులోనే కొనసాగితే విద్యార్థులు విషయపరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు నేర్చుకున్న వారవుతారని తెలిపారు. ఇందుకు గురువులు