ప్రజాపక్షం/హైదరాబాద్: కొత్తగా నియమితులైన రాష్ట్ర సమాచార కమిషనర్లు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాజాసదారాం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కట్టా శేఖర్‌రెడ్డి, గుగ్లోత్ శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మైద నారాయణరెడ్డి, డాక్టర్. మహ్మద్ అమీర్ హుస్సేన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. వీరంతా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ బుద్ధా మురళి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌లతో పాటు సమాచారశాఖ అధికారులు పాల్గొన్నారు.
సమాచార కమిషనర్ల పదవీ ప్రమాణ స్వీకారం
RELATED ARTICLES