కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
కాలేజీలలో యాంటీ రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని సూచన
ప్రజాపక్షం / హైదరాబాద్ డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదంటూ మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కు మంగళవారం నాడు గవర్నర్ లేఖ రాశారు. మెడికల్ కాలేజీ ల లో యాంటీ రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని సూచించారు. మహిళా మెడికో లకు
ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, ఇలాంటి సంఘటనల లో ఎలాంటి ఉదాసీనత లేకుండా , తక్షణం స్పందించి కాలేజీ ల లో కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ల లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పిజి మెడికో ల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ సెంటర్ లు కూడా మహిళా మెడికో ల కు ఏర్పాటు చేయాలన్న గవర్నర్ పేర్కొన్నారు.
ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎంఎల్‌సి కవిత
డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆమె మరణానికి కారణమైన దోషులను రాష్ర్ట ప్రభుత్వం వదిలిపెట్టబోదని ప్రీతి తల్లిద్రండులకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవతి హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ర్ట ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆమె తల్లిదండ్రులు నరేందర్ , శారదలకు కవిత మంగళవారం నాడు లేఖ రాశారు. ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యానని, ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో తానూ ఒకరినని తెలిపారు. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నానని, చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్త ం చేశారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుందని, ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి అని ప్రీతి తల్లిదండ్రులకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. మీ కుటుంబానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం , బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలి
RELATED ARTICLES