చుక్కలు చూపిస్తోన్న వంట గ్యాస్ నగదు బదిలీ పథకం
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ జరిగి రోజుల గడుస్తున్నా
వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమకాని సబ్సిడీ సొమ్ము
ఇబ్బంది పడుతున్న ప్రజలు, వినియోగదారులు
సిటీబ్యూరో : వంట గ్యాస్‌కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమకావడం లేదు. నిబంధనల ప్రకారం ఎల్‌పిజి సిలిండర్ డోర్ డెలివరీ అయినా ఒకటి రెండు రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నగరంలో వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలవరీ జరిగి 15 రోజులవుతున్నా నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము వారి ఖాతాల్లో జమకావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో దాదాపు 28.21 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఐఒసికి సంబంధించిన 11.94 లక్షలు, బిపిసిఎల్‌కు సంబంధించిన 4.94 లక్షలు, హెచ్‌పిసిఎల్‌కు సంబంధించి 11.31 లక్షలు కనెక్షన్లు ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై డోర్ డెలవరీకీ ముందుగా పూర్తి ధర చెల్లించిన కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన సొమ్ము నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఇదీ కేవలం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. అయితే వంట గ్యాస్ నగదు బదిలీ పథకం పేద వినియోగదారుల పాలిట శాపంగా తయారైంది. గతంలో ఈ పథకం ద్వారా బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు సక్రమంగా జమ అయ్యేవి. ఇప్పుడు సబ్సిడీ డబ్బులు సిలిండర్ డెలవరీ అయి 25 రోజులు అవుతున్నా ఖాతాల్లో జమ కావడం లేదు. కొందరికి కొన్ని నెలలుగా డెలవరీ అవుతున్నా ఖాతాల్లో సబ్సిడీ జమ పూర్తిగా నిలిపిపోయింది. ఈ విషయమై గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదిస్తే మాకు సంబంధం లేదని, ఆయిల్ కంపెనీల వద్దకు వెళ్లి అడగమని దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
సబ్సిడీ ఎక్కడ?
RELATED ARTICLES