మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం
మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన మిథాలీసేన
సూరత్: భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళాల జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను మిథాలీ సారథ్యంలోని భారత మహిళల జట్టు 3–0తో క్లీవ్ స్వీప్ చేసింది. వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సరైన ఆరంభం లభించలేదు. మొదటి రెండు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. మిథాలీ రాజ్(11), పొన్నమ్ రౌత్(15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్‌ఉమెన్ కూడా నిరాశపరిచారు. దీంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శిఖా పాండే (35)తో కలిసి హర్మన్‌ప్రీత్ (38) ఆదుకుంది. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె మూడు వికెట్లు తీయగా… ఇస్మాయిల్, ఖాకా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ దెబ్బకు 140 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో మరిజన్నె (29), సునే (24) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో ఏక్తా మూడు, దీప్తి శర్మ, రాజేశ్వరి చెరో రెండు, జోషి, జెమినా, హర్మన్‌ప్రీత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఏక్తా బిస్త్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా… మరిజన్నెకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
సఫారీ అమ్మాయిలకు వైట్‌వాష్
RELATED ARTICLES