కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ దేశ బోర్డు దిద్దుబాటు చర్యలను చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా దిగ్గజ ఆటగాడు జాక్వస్ కల్లిస్‌ను నియమించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్వీటర్ అకౌంట్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది. సమ్మర్‌లో సద్వేశంలో జరుగనున్న మొత్తం మ్యాచ్‌లకు కల్లిస్‌ను దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ’జాక్వస్ కల్లిస్‌ను జట్టు స్వదేశీ వేసవి సీజన్ సమయంలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమిస్తున్నాం. ప్రిటోరిలో బుధవారం అతను జట్టుతో కలుస్తాడు. కలిస్ అనుభవం మా జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది’ అంటూ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. ఈ వేసవి సీజన్‌లో సౌతాఫ్రికాలో ఇంగ్ల్‌ండ జట్టు పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇంగ్ల్‌ండ తర్వాత సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. దక్షిణాఫ్రికా తరఫున 519 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కల్లిస్.. 25,534 పరుగులు, 577 వికెట్లు తీశారు. కల్లిస్ 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ20లు ఆడారు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన కల్లిస్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2015 సీజన్‌లో కేకేఆర్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ సంధి దశలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డుమిని, తాహిర్ ఒక్కసారిగా రిటైర్మెంట్ తీసుకోవడంతో ఆ జట్టు గాడి తప్పింది. దీంతో బోర్డు తమ కోచింగ్ బృందంలో భారీ మార్పులను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ను దక్షిణాఫ్రికా హె్‌డ కోచ్‌గా నియమించారు. 2023 వరకూ బౌచర్ కోచ్‌గా కొనసాగనున్నారు. తాజాగా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కల్లిస్‌ను నియమించింది. త్వరలోనే మీడియం పేస్ బౌలర్ చార్ల్ లాంగ్‌వెల్ జట్టు కోచింగ్ సిబ్బందిలో భాగం కానున్నారు. లాంగ్‌వెల్ ఇప్పటికే బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. లాంగ్‌వెల్ రాజీనామాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ చైర్మన్ అక్రమ్ ఖాన్ అంగీకరించారు. ఇక మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రొటీస్ రాత మారుతుందేమో చూడాలి.
సఫారీలకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలీస్
RELATED ARTICLES