నేడు నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్
సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
కోల్‌కతా: హైదరాబాద్ జట్టు సన్‌రైజర్స్ కొత్త సమరానికి రెడీ అయింది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఐపిఎల్ సీజన్‌కు హైదరాబాద్ జట్టు సిద్ధమయింది. నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రై జర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ సీజన్ తన ప్రసానాన్ని మొదలు చేయనుంది. 2013 నుంచి ఐపిఎల్‌లో అడుగు పెట్టిన సన్‌రైజర్స్ 2016లో విజేతగా నిలిచింది. చివరి ఏడాది తృటిలో మరో టైటిల్‌ను మిస్ చేసు కుంది. ఇప్పుడు తాజాగా రెండో టైటిల్ వేటలో హైదరాబాద్ జట్టు అడుగులు వేస్తోంది. ఈసారి గతం కంటే మరింత పటిష్టంగా సన్‌రైజర్స్ జట్టు కనబడుతున్నది. దానికి కారణం 2018 సీజన్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి టోర్నీకి దూరమైన డేవిడ్ వార్నర్ ఈసారి మళ్లీ జట్టులో చేరాడు. అందుకే సన్‌రైజర్స్ బలం రెట్టింపాయింది. 2018 సీజన్‌లో కేన్ విలియమ్సన్ హైదరాబాద్ జట్టును అద్భుతంగా నడిపించిన విషయం తెలి సిందే. అయితే ఈసారి కూడా విలియమ్సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచేప్తున్నట్టు జట్టు మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. గత ఏడాది కెప్టెన్‌కు వ్యవహరించిన విలియమ్సన్ అద్భుతంగా తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. జట్టును ముందుండి నడిపంచడంతో పాటు తాను కూడా బ్యాట్‌తో చెలరేగి ఆడాడు. ఫలితంగా చివరి సీజన్‌లో సన్‌రైజర్స్ ఫైనల్ వరకు చేరింది. ఇక ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. కానీ ఈ సారి వార్నర్ కూడా అందుబా టులో ఉండడంలో హైదరాబాద్ జట్టు మరింతగా చెలరేగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభా గాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు సైతం తమ సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సన్‌రైజర్స్‌కు మొదటి నుంచే బౌలింగే ప్రధాన అస్త్రంగా కొనసాగుతూ వస్తోంది. ప్రపంచ టాప్ క్లాస్ బౌలర్లు ఈ జట్టుకు సొంతం. అంచనాలు భారీగా లేకున్న ఇక్కడ ప్రతి బౌలర్ మెరుగైన ప్రదర్శనలు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ఎంతటి స్టార్ బ్యాట్స్‌మెన్స్ ఉన్న సన్‌రైజర్స్‌తో ఆడితే వారు 150 పరుగులు దాటడం మహా కష్టమనే చెప్పాలి. దాదాపు బ్యాటింగ్‌నే నమ్ముకునే జట్లు సైతం సన్‌రైజర్స్‌పై భారీ పరుగులు చేయలేక పోయాయి. ఒకటి రెండు సార్లు పెద్ద స్కోర్లు నమోదైనా.. దాదాపు మ్యాచుల్లో మాత్రం సన్ బౌలర్లదే పైచేయి. భారత స్టార్ పేసన్ భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ జట్టులో ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్లలో భువీకి మరొకరూ సాటిలేరు. ఇక ఆఫ్ఘనిస్థాన్ యువ సంచలనం రషీత్ ఖాన్ సన్‌రైజర్స్ జట్టుకే హైలైట్. ఇతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం పెద్ద పెద్ద బ్యాట్స్‌మెన్స్‌కు సైతం కష్టమే. పరుగులు నియంత్రించడం.. వెనువెంటనే వికెట్లు తీయడం ఈ యువ క్రికెటర్ స్పేషాలిటి. మరో వైపు బ్యాట్‌తో కూడా ఈ చిన్నోడు హల్‌చల్ చేయగలుగుతాడు. ఇక ఆల్‌రౌండర్లు యూసుఫ్ పఠాన్, విజయ్ శంకర్, సాకిబుల్ హసన్ సన్‌రైజర్స్ జట్టులో ఉండడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఓవరాల్‌గా సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల నైపుణ్యం అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. అందుకే మరోసారి ‘సన్.. రైజింగ్’ అవడానికి పూర్తిగా సిద్ధమైంది.
వార్నర్ రాకతో మరింత పటిష్టం..
ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన అధిక విజయాల్లో సింహభాగం డేవిడ్ వార్నర్‌దే. వరుసగా ప్రతీ ఏటా టాప్‌స్కోరర్‌గా నిలవడంతో పాటు 2016లో తన కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో గత ఏడాది ఐపిఎల్‌కి దూరమైన వార్నర్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతుండటంతో సన్‌రైజర్స్ బలం రెట్టింపు అయింది.
రైజర్స్ బలాలు..
సన్‌రైజర్స్ మొదటి నుంచి తుది జట్టు విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. ఇదే ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. స్థిరమైన ఓపెనర్లు, పేస్ బౌలింగ్ బృందం, స్పిన్ వ్యూహాలు అన్నీ పక్కాగా జరిగాయి. ధావన్ దూరమయ్యాడు కాబట్టి వార్నర్, విలియమ్సన్ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయం. 2018లో విలియమ్సన్ ఏకంగా 8 అర్ధసెంచరీలతో 735 పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి వార్నర్‌లాంటి విధ్వంసకా సహచరుడు తోడైతే ఇక అద్భుత ఆరంభం ఖాయం. ఆ తర్వాత మనీశ్ పాండే, విజయ్ శంకర్, యూసుఫ్ పఠాన్, దీపక్ హుడా, రికీ భుయ్‌లు జట్టు బ్యాటింగ్ భారం మోసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌కు గుర్తుంచుకోదగ్గ విజయాలు అందించిన భువనేశ్వర్ మరోసారి పేస్ భారం మోయనుండగా, ఇటీవలే భారత జట్టుకు ఆడిన ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్ అండగా నిలవనున్నారు. ఇక రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్ తరఫున ఆడిన రెండు సీజన్‌లలో కలిపి కేవలం 6.68 ఎకానమీతో 38 వికెట్లు తీసిన రషీద్ వేసే 4 ఓవర్లను ఎదుర్కోవడం ఏ ప్రత్యర్థి జట్టుకైనా కష్టమే. తొలిసారి ఐపిఎల్లో అడుగు పెట్టిన బెయిర్ స్టో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ స్టార్ సాకిబుల్ హసన్ కూడా అద్భుత ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే నలుగురు విదేశీ కోటాలో వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాయం కాగా… నాలుగో స్థానం కోసం చాలా పోటీ ఉంది. ఈ స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాల్సిందే.
రైజర్స్ బలహీనతలు..
ఐపిఎల్‌లో అరంగేట్రం నుంచి సన్రైజర్స్‌కు లభించిన అధిక విజయాలు బౌలింగ్ ప్రదర్శన వల్లే వచ్చాయి. అతి తక్కువ స్కోర్లు చేసి కూడా జట్టు మ్యాచ్‌లను బౌలర్ల కారణంగా కాపాడుకోగలిగింది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా జట్టుకు మిడిలార్డర్ బ్యాటింగ్ సమస్య ఉంది. భారత ఆటగాళ్లే ఆడాల్సిన ఈ స్థానాల్లో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవు. మనీశ్ పాండే, దీపక్ హుడా పెద్దగా ఫామ్‌లో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది. వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించాల్సిన అవసరం ఎంతైన ఉంది. మరోవైపు సీనియర్ యూసుఫ్ పఠాన్ కూడ మునుపటిలాగా విధ్వంసకర బ్యాటింగ్ చేయలేక పోతున్నాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ భుజం గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ మంచిగా రాణించిన.. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆటగాళ్లు వారికి అండగా ఉంటే చాలు సన్‌రైజర్స్ మరోసారి ఐపిఎల్ తమ ముద్ర వేసుకోవడం సులభమే. జట్టులో కొన్ని బలహీనతలు ఉన్నా కానీ వాటిని అధిగమించేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యర్థి సవాళ్లకు ధీటైన జవాబులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
కోల్‌కతా మరోసారి..
ఐపిఎల్‌లో విజవంతమైన జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. ఇప్పటి వరకు నైట్‌రైడర్స్ రెండు సార్లు టైటిళ్లను ముద్దాడింది. ఇక మరోసారి మూడో టైటిల్ వేటలో బరిలో దిగుతోంది. జట్టులో స్టార్ ఆటగాళ్లే అధికం. ఈ జట్టుకి దినేశ్ కార్తిక్ నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్‌లోనూ కార్తిక్ మంచి కెప్టెన్‌గా పేరు సంపాదించుకున్నాడు. మాజీ కెప్టెన్ గంభీర్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో కార్తిక్ జట్టు బాధ్యతలు చేపట్టాడు. బ్యాటింగ్‌లోనే కార్తిక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల భారత్‌కు తన మెరుపు బ్యాటింగ్‌తో గొప్ప విజయాలు అందించాడు. మరోవైపు రాబిన్ ఉత్తప్ప, క్రిస్ లీన్, బ్రాత్‌వైట్, శుభ్‌మాన్ గిల్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా, ఫ్రెర్గ్యూసన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కెకెఆర్ జట్టు పటిష్టంగా కనబడుతున్నది. ఈసారి కూడా టైటిల్ ఫేవరేట్‌లలో ఒకటిగా నైట్‌రైడర్స్ బరిలో దిగుతున్నది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే బలమైన ప్రత్యర్థితో కెకెఆర్ ఢీ కొననుంది. అందరూ కలిసి కట్టుగా రాణిస్తే కెకెఆర్ విజయం ఖాయం.