నేడు ఉప్పల్ వేదికగా కోల్‌కతాతో మ్యాచ్,
సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
హైదరాబాద్: గత మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే జో రును కోల్‌కతాపై సాగిస్తుందోమే చూడాలి. నేడు ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇదే వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను హైదరాబాద్ 6 వికెట్లతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో సన్ బౌలర్లు చెలరేగడంతో చెన్నైను 132/5 పరుగులకే కట్టడి చేయడం జరిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు మరోసారి అర్ధ శతకాలతో చెలరేగి హైదరాబాద్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో సన్ జట్టు 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న సూపర్ కింగ్స్‌ను ఓడించి హైదరాబాద్ జట్టు తమ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. వరుసగా మూడు ఓటములు అనంతరం సన్‌రైజర్స్‌కు ఆ విజయం దక్కడం విశేషం. ఈ సీజన్ ఐపిఎల్‌లో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడింది. అందులో నాలుగు విజయాలతో పాటు నాలుగు ఓటములను చవిచూసింది. అదే కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి ఐదింట్లో ఓడింది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో 8 పాయింట్లతో సమానంగానే ఉన్నా.. రన్‌రేట్ పరంగా మెరుగ్గా ఉన్న హైదరాబాద్ జట్టు ఆరో స్థానం దక్కించుకుంది. మరోవైపు కోల్‌కతా జట్టు ఏడో స్థానంలో నిలిచింది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో జోరును ప్రదర్శించిన నైట్‌రైడర్స్ రానురాను డీలా పడుతోంది. శుక్రవారం రాత్రి బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో కెకెఆర్ 10 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు మోయిన్ అలీ మెరుపు వేగంతో అర్ధ శతకం చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి రెండువందలపై పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కెకెఆర్ ఆరంభంలో తడబడినా ఆఖర్లో నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో హల్ చేశారు. దాంతో కెకెఆర్ విజయానికి చేరువైంది. కానీ కోల్‌కతా విజయానికి చివరి ఓవర్లో 24 పరుగులు చేయాల్సిన తరుణంలో చివరి ఓవర్ వేసిన మోయిన్ తెలివిగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్‌ను కోల్‌కతా నుంచి గుంజుకున్నాడు. ఓవరాల్‌గా కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో గట్టిగా పోరాడి ఓడిందనే చెప్పాలి. మరోసారి ఆ జట్టు స్టార్ హిట్టర్ రసెల్ తన ప్రతాపాన్ని చూపెట్టాడు. రసెల్ 25 బంతుల్లోనే 2 ఫోర్లు 9 సిక్సర్లతో 65 పరుగులు చేసి తన వీరవిహారాన్ని ప్రదర్శించాడు. మరోవైపు నితీశ్ రాణా కూడా 45 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విజృంభించి ఆడాడు. కోల్‌కతా జట్టులో బ్యాట్స్మెన్లు చురుగ్గా ఆడుతున్న బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. ప్రత్యర్థి జట్లకు భారీ పరుగులు సమర్పించుకుంటూ ఒత్తిడికి లోనవుతున్నారు. భారీ ఆశలతో నూతన ఐపిఎల్ సీజన్ అడుగుపెట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎలాగైన నాకౌట్ స్టేజ్‌కు చేరాలని తహతహలాడుతోంది. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో నెగ్గి తమ వరుస ఓటములకు ఫుల్స్టాప్ పెట్టాలని కెకెఆర్ భావిస్తోంది. మరోవైపు గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ జట్టు ఈసారైనా టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందుకోసం మిగిలిన మ్యాచుల్లో గెలిచి ఎలాగైన నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకోవాలని ఆశిస్తోంది. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ రెండు జట్లు కూడా గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక సొంత అభిమానుల మధ్య హైదరాబాద్ జట్టు హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది.
ఓపెనర్లపైనే భారం..
సన్‌రైజర్స్ ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో ఓపెనర్లే కీలక పాత్ర వహించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన దాదాపు చాలా మ్యాచుల్లో మంచి ఆరంభాన్ని అందిస్తూ సన్‌రైజర్స్‌కు అండగా నిలిస్తున్నారు. ప్రస్తుతం వార్నర్ (450 పరుగులు)తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 8 మ్యాచుల్లో (75) సగటుతో ఈ అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. మరోవైపు బెయిర్ స్టో (365 పరుగులు) ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోల్‌కతా మ్యాచోలోనూ ఈ ఇద్దరిపైనే సన్‌రైజర్స్ యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది. వీరిద్దరూ మరో గొప్ప ఆరంభం ఇవ్వాలని ఆశిస్తోంది. ప్రస్తుతం వీరున్న ఫామ్‌ను చూస్తుంటే మరో వంద పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ఖాయమనిపిస్తోంది. కెకెఆర్ బౌలింగ్ కూడా అంతా స్ట్రాంగ్‌గా లేకపోవడం వీరికి కలిసోచ్చే అంశమనాలి. ఇక వరుస అర్ధ శతకాలతో జోరును ప్రదర్శిస్తున్న వార్నర్ ఈ మ్యాచ్‌లోనే 500 పరుగుల మార్కును అందుకుంటుండేమో చూడాలి.
మిడిల్ ఆర్డర్ పుంజుకోవాలి..
సన్‌రైజర్స్‌లో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందిస్తున్న తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నారు. విజయ్ శంకర్ పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్మెన్లు ఆకట్టుకోలేక పోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ ఆటగాళ్లు చెత్త బ్యాటింగ్‌తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతుల ఓడిపోయారు. ఆ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు తొలి వికెట్‌కు 70 పరుగులపై జోడించిన మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కలిసి మరో 70 పరుగులు కూడా చేయలేక పోయారు. ఫలితంగా తక్కువ స్కోరు మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కు ఘోర ఓటమితప్పలేదు. ఇక లీగ్ చివరి మ్యాచుల్లోనైన హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ఆదివారం కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో అందరూ కలిసికట్టుగా రాణిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం ఎవరితరం కాదు. ఇక బౌలింగ్‌లో హైదరాబాద్ పర్వాలేదనిపిస్తోంది. ఒకటి రెండు మ్యాచుల్లో తేలిపోయినా ఓవరాల్‌గా మాత్రం బౌలర్లు మంచి ప్రదర్శనే చేశారు. రషీద్ ఖాన్ గత సీజన్లలాగా బౌలింగ్ చేయకపోవడం సన్‌రైజర్స్‌కు కలపరపెడుతోంది. పొదుపుగా బౌలింగ్ చేస్తున్న వికెట్లు మాత్రం దక్కడం లేదు. ఇక జట్టు ప్రధాన బౌలర్ వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఆచితూచి బౌలింగ్ చేస్తున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకోకుండా జాగ్రత్తగా బౌలింగ్ చేస్తున్నాడు. మరోవైపు యువ బౌలర్లు ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్లు పర్వాలేదనిపిస్తున్నారు. మొత్తంగా సన్‌రైజర్స్ బౌలింగ్ దలం పటిష్టంగా ఉంది.
కోల్‌కతా ఈ సారైనా..
గత నాలుగు మ్యాచుల్లో వరుసగా ఓటములను చవిచూసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా విజయం సాధిస్తుందా.. లేక వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంటుందా వేచిచూడాలి. నైట్‌రైడర్స్ బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉన్నా.. బౌలింగ్‌లోనే ఈ జట్టు కాస్తా డీలాగా ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్లనే పెద్దగా నమ్ముకున్న ఈ జట్టులో వారు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. ఐపిఎల్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సునీల్ నరైన్ ఈ సారి మాత్రం నిరాశ పరుస్తున్నాడు. పేలవమైన బౌలింగ్‌తో పాటు వికెట్లు కూడా తీయలేక పోతున్నాడు. మరోవైపు భారత స్టార్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం ఆకట్టుకోలేక పోతున్నాడు. ఆర్సిబితో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలోనే ఒక స్పిన్నర్ సమర్పించుకున్న అత్యధిక పరుగుల జాబితాలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న ఇమ్రాన్ తాహీర్‌తో కలిసి సమానంగా కుల్దీప్ నిలిచాడు. ఇక పియూష్ చావ్లా, ప్రసిద్ కృష్ణ, గ్రునే అప్పుడప్పుడు విజృంభించి బౌలింగ్ చేస్తున్నారు. కానీ ప్రతిసారి మెరుగైన ప్రదర్శన మాత్రం చేయలేక పోతున్నారు. బ్యాటింగ్ విషయానికోస్తే క్రిస్ లీన్, సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్, రాబిన్ ఉతప్ప, కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లు ఆచితూచి ఆడుతూ జట్టుకు అండగా నిలబడుతున్నారు. మరోవైపు జట్టు స్టార్ ఆటగాడైన ఆండ్రీ రసెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో నైట్‌రైడర్స్ ఇప్పటివరకు సాధించిన విజయాల్లో ఇతనే ముఖ్య భూమిక వహించాడు. ఐపిఎల్ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో రసెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ రసెల్ చివరి వరకు గట్టిగా పోరాడు. అయినా భారీ పరుగుల ఛేదనలో నైట్‌రైడర్స్‌కు 10 పరుగుల స్వల్ప ఓటమి తప్పలేదు.
జట్ల వివరాలు: (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, యూసుఫ్ పఠాన్, రికీ భుయ్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, సిద్దార్థ్ కౌల్.
కోల్‌కతా నైట్ రైడర్స్ : దినేశ్ కార్తిక్ (కెప్టెన్, వికెట్ కీపర్), రాబిన్ ఉత్తప్ప, క్రిస్ లీన్, శుభ్‌మాన్ గిల్, ఆండ్రీ రసెల్, బ్రాత్‌వైట్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, నితీశ్ రాణా, ప్రసిధ్ కృష్ణన్, లూకీ ఫెర్గ్యూసన్, హారి గుర్నే, యర్ర పృథ్వీరాజ్.