హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్- భారత జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత బౌలింగ్, బ్యాటింగ్‌లలో పుంజుకుంది. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ చేసింది. వికెట్ల లేమితో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. షమీ మూడు వికెట్లు తీసుకోగా, నవ్‌దీప్ సైనీ, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు బౌలర్లు ఫామ్‌లోకి రావడం శుభపరిణామమే. కివీస్ ఆటగాళ్లలో రచిన్ రవీంద్ర 34, ఫిన్ అలెన్ 20, హెన్రీ కూపర్ 40, టామ్ బ్రూస్ 31, కెప్టెన్ డేరీ మిచెల్ 32 పరుగులు చేశారు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన పృథ్వీషా 39 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 81 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 70, వృద్ధిమాన్ సాహా 30 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో డెరిల్ మిచెల్ మూడు వికెట్ల పడగొట్టాడు. కాగా, ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 21న వెల్లింగ్టన్‌లో ప్రారంభమవుతుంది.
సన్నాహక మ్యాచ్ డ్రా
RELATED ARTICLES