రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు
ప్రజాపక్షం/హైదరాబాద్ సచివాలయ భవనాల కూల్చివేతల ఫొటోలు, వీడియోలను ప్రభుత్వమే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలకు ఎందుకు విడుదల చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యుద్ధం జరుగుతుంటే కూడా మీడియా కవరేజీ చేస్తోందని, సచివాలయ భవనాల కూల్చివేతలపై ఎందుకు మీడియాను అనుమతి ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని కోరింది. కూల్చివేత పనులను ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయకుండా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటోందని విల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (వి6 టివి, వెలుగు పత్రిక) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం విచారణ జరిపారు. ప్రభుత్వాన్ని సంప్రదించిన చెప్పేందుకు విచారణను వారం రోజులకు వాయిదా వేయాలని ఎజి బిఎస్ ప్రసాద్ కోరారు. ఇందుకు పిటిషనర్ లాయర్ నవీన్ అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం చెప్పబోయేది తెలుసుకోడానికి అంతసమయం అవసరం లేదని, గురువారం నాడు చెప్పాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. సమాచారాన్ని సేకరించే హక్కు పత్రికలకు ఉందని, సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, రాజ్యాంగం కల్పించిన ఈరెండు హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని పిటిషనర్ లాయర్ చెప్పారు. ఒక వ్యక్తి తనకు నచ్చిన వృత్తి చేసుకునే హక్కు 19(1)(జి) ద్వారా రాజ్యాంగం కల్పించిందని, జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించకుండా ప్రభుత్వ ఆంక్షలు ఉన్నాయన్నారు. ప్రమాదాలు జరుగుతాయనే ఆంక్షలు విధింపు జరిగిందని ఏజీ చెప్పారు. ఇప్పుడు మీడియాను అనుమతి ఇస్తే రేపు ప్రజల్ని కూడా అనుమతి ఇవ్వాల్సివస్తుందన్నారు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని, కూల్చివేత పనులు గుట్టుగా చేయడం లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టులు సైతం కూల్చివేతలకు అనుమతులు ఇచ్చాయని చెప్పారు. వాదనల తర్వాత విచారణ గురువారానికి వాయిదా పడింది.
సచివాలయం కూల్చివేతపై మీడియాను ఎందుకు అనుమతించడం లేదు
RELATED ARTICLES