హర్మన్‌ప్రీత్
మెల్‌బోర్నె : ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతుంది. శనివారం శ్రీలంకత జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా భారత మహిళలు సమష్టి ప్రదర్శనతో అలరించారు. ముందుగా అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన హర్మన్ సేన.. అనంతరం సూపర్ బ్యాటింగ్‌లో అలవోక విజయాన్నందుకున్నారు. అయితే భారత్ వరుసగా గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మది కీలక పాత్ర. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్‌పైనే భారత బ్యాటింగ్ ఆధారపడి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 39, 39, 46, 47 వరుసగా ఆమె చేసిన పరుగులే దీనికి నిదర్శనం. శ్రీలంకతో కూడా అదరగొట్టిన ఈ లేడీ సెహ్వాగ్ రనౌట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. అయితే శ్రీలంకతో విజయానంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ షెఫాలీ వర్మపై ప్రశంసల జల్లు కురిపించింది.’షెఫాలీ భారీ షాట్లు ఆడటానికి ఇష్టపడుతుంది. ఆమె విధ్వంసాన్ని మేం అడ్డుకోవాలనుకోవడం లేదు. షెఫాలీ తన దూకుడును అలానే కొనసాగిస్తూ తన ఆటను ఆస్వాదించాలి.’అని హర్మన్ ప్రీత్ తెలిపింది. ఇక ఈ మెగాటోర్నీలో విఫలమవుతున్న హర్మన్‌ప్రీత్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా గత ఈ హిట్టర్ స్థాయికి తగ్గ ప్రదర్శన బాకీ ఉంది. అయితే శ్రీలంకతో బాగా ఆడాలని ప్రయత్నించినట్లు ఈ లేడీ కెప్టెన్ చెప్పుకొచ్చింది. ’ఈ రోజు సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించా. కొన్ని భారీ షాట్లు కూడా ఆడాను. భవిష్యత్తు మ్యాచ్‌ల్లో నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.’అని తెలిపింది.
షెఫాలీకి అడ్డు చెప్పం
RELATED ARTICLES