శ్రీశైలం/హైదరాబాద్ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శనివారం ఉదయం 11.30 ప్రాం ంలో మూడు గేట్లు ఎత్తివేయడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో మూడు గేట్లను ఎత్తివేసి వరద నీటిన దిగువకు విడుదల చేశారు. ఎపి జలవనరుల శాఖా మంత్రి అంబటి రాం బాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టిఎంసిలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది. ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వినోద్ కుమార్ ‘హైడ్రో పవర్ హౌస్’ సందర్శన
శ్రీశైలంలోని జెన్‌కో అండర్ గ్రౌండ్ పవర్ హౌస్, హైడ్రో పవర్ స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జెన్.కో. ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. హైడ్రో పవర్ స్టేషన్ పనితీరు గురించి వినోద్ కుమార్‌కు శ్రీశైలం పవర్ హౌస్ చీఫ్ ఇంజనీర్ రామసుబ్బారెడ్డి వివరించారు. కొంత కాలం కిందట జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటన తరువాత, శ్రీశైలం పవర్ హౌస్‌లోని మొత్తం ఆరు యూనిట్లలలో ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని, త్వరలోనే ఆరవ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చీఫ్ ఇంజనీర్ రామసుబ్బా రెడ్డి వివరించారు. శ్రీశైలం జెన్.కో పవర్ హౌస్ హైడ్రో పవర్ స్టేషన్ పనితీరు పట్ల వినోద్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
RELATED ARTICLES