న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి కేసులో అరెస్టయిన కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్‌ను ఈనెల 13 వరకూ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. అదే రోజు శివకుమార్ బెయిల్ అప్లికేషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. నిందితుడిపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. నేరాన్ని దృష్టిలో పెట్టుకుని నిందితుడిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయడం ద్వారానే దర్యాప్తుకు న్యాయం జరుగుతుందన్నది నా అభిప్రాయం’ అని ప్రత్యేక జడ్జి అజయ్ కుమార్ కుహర్ చెప్పారు. ఇడి తరఫు న్యాయవాది తన వాదనను జడ్జికి వినిపిస్తూ, విచారణకు శివకుమార్ సహకరించడం లేదని, ఎగవేత సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. శివకుమార్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. గత కొన్నేళ్లలో ఆయన కుటుంబసభ్యుల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిందని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఇడి రిమాండ్ అప్లికేషన్‌ను శివకుమార్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా వ్యతిరేకించారు. తన క్లయింట్ తరఫున బెయిల్ అప్లికేషన్ ఇప్పటికే సమర్పించానని చెప్పారు. దీనికి ఇడి తరఫు న్యాయవాది స్పందిస్తూ, శివకుమార్ బెయిల్ అప్లికేషన్‌పై సమాధానం చెప్పేందుకు తమకు కొంత సమ యం కావాలని కోర్టుకు విన్నవించారు. ఇడి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్, న్యాయవాది ఎన్‌కె మట్ట కోర్టుకు హాజరయ్యారు. శివకుమార్‌కు బెయిల్ కోరుతూ అభిషేక్ మను సింఘ్వీ మూడు సూచనలు చేశారు. కోర్టు ఎలాంటి షరతులపైన బెయి ల్ ముం జూరు చేసినా ఫరవాలేదని అన్నారు. పోలీసు రిమాండ్ లేకుండా చూడాలని, లాయర్లు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు తన క్లయింట్‌ను అనుమతించాలని కోరారు. నాలుగు రోజుల ఇంటరాగేషన్‌లో శివకుమార్‌ను ప్రశ్నించలేకపోయిన విషయాలేమిటో ఇడి చెప్పాలన్నారు. తన క్లయింట్ చాలాకాలంగా లో-బ్లడ్ ప్రెషర్, థెరాయిడ్, హై షుగర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయనకు సరైన వైద్యసహాయం అవసరమని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇడి తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్, న్యాయవాదులు నితీశ్ రాణా, అమిత్ మహాజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 14 రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను కోరిన తర్వాత కోర్టు ఈ నెల 13 వరకూ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.ఇదిలావుండగా ‘కర్ణాటక ప్రజలను ఉద్దేశించి తన క్లయింట్ మాట్లాడవచ్చా?’ అని జడ్జి అజయ్ కుమార్ కుహర్‌ను ఉద్దేశించి శివకుమార్ తరఫు న్యాయవాది అడగగా, ఎంతమాత్రం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే కోర్టు రూమ్‌లోనే కుటుంబ సభ్యులతో కలిసేందుకు శివకుమార్‌కు కోర్టు అనుమతించింది.‘శివకుమార్‌కుబుధవారం ఆహారం కూడా ఇవ్వలేదని, ఇది మెల్లగా హింసించడ మే’ అని ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. శివకుమార్, న్యూఢిల్లీలోని కర్నాటక భవ న్ ఉద్యోగి హనుమంతయ్య, మరి కొందరిపై 2018 సెప్టెంబర్‌లో ఇడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. శివకుమార్, ఆయన సహచరుడిగా భావిసు న్న ఎస్‌కె శర్మ లెక్కకు రాని నగదును పెద్ద ఎత్తున ‘హవాలా’ ద్వారా రెగ్యులర్‌గా తరలిస్తున్నారని ఆదాయ పు పన్ను శాఖ ఆరోపించింది.ఆ హవాలాను ముగ్గురు నిందితుల ద్వారా నిర్వర్తిస్తున్నట్లు కూడా పేర్కొంది.
శివకుమార్‌కు 13 వరకు రిమాండ్
RELATED ARTICLES