ఆర్‌టిసి కార్మికులకు లండన్‌లోని రాజకీయ జెఎసి మద్దతు
ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మెకు లండన్‌లోని రాజకీయ జెఎసి మద్దతు తెలిపింది. న్యాయ సలహా మేరకు ఆర్‌టిసి కార్మికులకు లండన్ నుండి ఆర్ధిక సహాయం చేయాలని తీర్మానించింది. ఆర్‌టిసి సమ్మెకు మద్దతుగా చేస్తున్న శాంతి పోరాటాలను అణచివేయడం అప్రజాస్వామికమని, ఆర్‌టిసి కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఆర్‌టిసి సమ్మెకు మద్దతుగా లండన్‌లో అఖిలపక్ష మద్దతు సభను నిర్వహించారు. అలాగే లండన్‌లోని థేమ్స్ నది వద్ద ఎన్‌ఆర్‌ఐలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. లండన్ ఎన్‌ఆర్‌ఐ తరహా అమెరికా తదితర దేశాల ఎన్‌ఆర్‌ఐ కూడా ఆర్‌టిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ప్రస్తుత కష్టకాలంలో మౌనం వహించడం తప్పు అని, సామాజిక బాధ్యతతో వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. నల్లగొండ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యను పరిష్కారించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరా రు. సిఎం అబద్ధ్దాలు చెప్పడం బాధాకరమన్నారు. బిజెపి నేత,మాజీ మంత్రి డి.కె. అరుణ మాట్లాడుతూ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు ఉద్యమ అణచివేతతో సమస్య మరో సమస్యకు దారి తీస్తుందన్నారు. ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ లండన్‌లోని థేమ్స్ నది వద్ద ఎన్‌ఆర్‌ఐలు ఆర్‌టిసి కార్మికులకు మద్దతు తెలపడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, ఎన్‌ఆర్‌ఐలు మద్దతు తెలపడం సంతోషమన్నారు. రాజకీయ పార్టీల ఎన్‌ఆర్‌ఐ నేతలు గంప వేణుగోపాల్, గంగసాని ప్రవీణ్‌రెడ్డి, శ్రీధర్ నీలా, దేవులపల్లి, నర్సింహారెడ్డి(కాంగ్రెస్), పసునూరి కిరణ్, ప్రవీణ్ బిట్ల(బిజెపి), రంగు వెంకటేశ్వర్లు, స్వామి, ఆకుల రాజుగౌడ్ (టిజెఎస్), శ్రీకోటి, చైతన్య(టిడిపి), అయ్యప్ప, హనీష్, అబ్దుల్(జనసేన), శివారెడ్డి, గణేష్‌రెడ్డి (వైసిపి), యుకె తెలంగాణ మే ధావుల వర్గం నుంచి ఓరుగంటి కమలాకర్ రావు, శ్రవణ్‌గౌడ్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
శాంతి పోరాటాలను అణచివేయడం అప్రజాస్వామికం
RELATED ARTICLES