HomeOpinionEditorialశబరిమల అందరిదీ

శబరిమల అందరిదీ

శబరిమల ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలన్న వాదనను కేరళ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మతంతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ దర్శించుకునే ఆలయం కేరళలో ఇదొక్కటే. హిందూయేతరులను నిషేధిస్తే ‘లౌకికవ్యవస్థ నాశనమవుతుంది’ అని హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. బిజెపి నాయకుడు టిజె. మోహన్ పిటిషన్ విచారణ సందర్భంగా, పిటిషన్ సమాజాన్ని రెండుగా విభజిస్తుంది లేదా వేర్పాటు చేస్తుంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భక్తులెవరూ వావర్ మసీదును సందర్శించకుండా శబరిమల దర్శించుకోలేరని కూడా పేర్కొన్నారు. కేసు విచారణ నవంబర్ 5కు వాయిదా పడింది.
దేవుడిని విశ్వసించేవారు దేవుడి దృష్టిలో మనుషులందరూ సమానమంటారు. కాని మనిషి మత అడ్డుగీతలు గీస్తున్నాడు. అన్యమతస్థులే కాదు, హిందువుల్లో భాగమైన దళితులను సంస్కరణోద్యమాలు బలంగా జరిగిన చోట తప్ప దేవాలయాల్లోకి అనుమతిస్తున్నారా? గాంధీజీ సైతం వారి ఆలయ ప్రవేశానికి నడుంకట్టినా ఫలితం పాక్షికమే. శబరిమలకు స్త్రీలను కూడా రానివ్వమంటున్నారు. అందువల్ల ముందు మనిషిని సంస్కరించాలి. అది జరగాలంటే తరతరాలుగా బుర్రల్లో జీర్ణించుకున్న కుల వ్యవస్థ అంతానికి, మతాల సంస్కరణకు అనగా బ్రాహ్మణీక వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు అవసరం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments