డెహ్రాడూన్: ఢిల్లీ డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుం ది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సి 4 బోగీలో మంటలు చెలరేగాయి. బోగీ మొత్తం అగ్నికి ఆహుతైంది. సిబ్బంది సమాచారమందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు ప్రకటించారు. హరిద్వార్‌లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే, మంటల్లో కాలిపోతున్న బోగీని ఇంజిన్ నుంచి వేరు చేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. సి 4లోని ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో, భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.