బెల్గామ్: శ్రీలంక ప్రారంభమైన అనధికారిక టెస్టులో భారత్ బ్యాట్స్‌మెన్‌లు అభిమన్యు ఈశ్వరన్ (189 బ్యాటింగ్; 250 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రియాంక్ పంచాల్ (160; 261 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన శతలకాలతో మెరిసారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో వికెట్ నష్టానికి 376 పరుగుల భారీ స్కోరు సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలో దిగిన కెప్టెన్ ప్రియాంక్ పంచాల్, ఈశ్వరన్‌లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. తమ వికెట్‌ను కాపాడుకుంటూనే స్కోరుబోర్డును వేగంగా ముందుకు సాగించారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదుదూ పరుగులు చేశారు. ఈ జోడీని విడదీయడానికి లంక కెప్టెన్ ఎంతగానో ప్రయత్నించాడు. తరచు బౌలర్లు మార్చి బౌలింగ్ చేయించిన ఫలితం దక్కలేదు. ఈక్రమంలోనే వీరిద్దరూ కూడా సెంచరీలు సాధించారు. మరోవైపు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 352 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 21 శతకాన్ని నమోదు చేసిన ప్రియాంక్ (160) స్కోరు వద్ద ఫెర్నాండో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్ (6 బ్యాటింగ్)తో కలిసి మరో ఓపెనర్ ఈశ్వరన్ (189 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో భాగంగా శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయాని భారత్ జట్టు 87 ఓవర్లలో 376/1 పరుగులు చేసింది.
శతకాలతో మెరిసిన ఈశ్వరన్, ప్రియాంక్
RELATED ARTICLES