ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ చీకటి ఒప్పందం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ప్రజాపక్షం/ హైదరాబాద్‌వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీతో యుద్ధం ప్రకటించిన సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని కాళ్లు పట్టుకున్నారని, చట్టాల విషయంలో యూ టర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఒక అభిప్రాయమంటూ లేదన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే టిఆర్‌ఎస్ దుకాణం బంద్ అవుతుందని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అసమర్ధ పాలన చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసి, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. నిరసన తెలియజేస్తున్న రైతుల పట్ల మోడీ ప్రభుత్వానికి కనీసం మానత్వం కూడా లేదన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీ రైతుల దీక్షకు సంఘీభావంగా సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద శనివారం దీక్ష నిర్వహించారు. దీక్ష శిబిరంలో టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి, ఎంఎల్‌సి టి.జీవన్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శులు మధుయాష్కిగౌడ్, డాక్టర్ జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎ.రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎంఎల్‌ఎలు తూర్పు జయప్రకాష్‌రెడ్డి(జగ్గారెడ్డి), పోడెం వీరయ్య, డిసిసి అధ్యక్షులు అనిల్, చల్లా నర్సింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి, మాజీ ఎంపి మల్లురవి, మాజీ ఎంఎల్‌సి ప్రేమ్‌సాగర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌గౌడ్ తదితరులు దీక్షకు సంఘీభావం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీ రైతులకు ఆర్థిక సాయం నిమిత్తం మధుయాష్కీగౌడ్ లక్ష రూపాయలు, ప్రేమ్‌సాగర్‌రావు రూ.50 వేలు, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రూ.40 వేలు, కె.జానారెడ్డి రూ.10 వేలు, వి.హనుమంతరావు రూ.5 వేలు విరాళాన్ని అందజేశారు.
ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ చీకటి ఒప్పందం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ చీకటి ఒప్పందంలో భాగంగానే వ్యవసాయ చట్టాలపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నదని టిపిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. బిజెపి, టిఆర్‌ఎస్‌లది గల్లీమే కుస్తీ, ఢిల్లీమే దోస్తీ మాదిరిగా ఉన్నదన్నారు. పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం దుర్మార్గమని, పంటలు కొనుగోలు చేస్తే రూ. 7,500 కోట్లు నష్టం వచ్చిందని చెప్పడం ప్రభుత్వ చేతకాని తనానికి పరాకాష్ట అని చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం, ఇతర పంటలు కొనుగులు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎలా నష్టం వస్తుందని ప్రశ్నించారు. బిజెపి ఒట్టి గాలి బుడగ అని ఎద్దేవా చేశారు. వరం గల్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ,ఖమ్మంలో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఇనుప ఫ్యాక్టరీ వచ్చే వరకు బిజెపికి మాట్లాడే హక్కు లేదని చెప్పారు.
కె.జానారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాటం చేసిన పరంపరను ఇప్పుడూ కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న సంఘాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు.
ఎ.రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 13 మంది అన్నదాతలు చనిపోయినప్పటికీ ప్రధాని మోడీకి మానవత్వం లేదన్నారు. ఢిల్లీ లోని రైతులకు మద్దతుగా ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తీసుకుందామని, ఇక్కడి నుంచి రైలులో ఢిల్లీకి వెళ్లి అక్కడి రైతులకు మద్దతు తెలుపుదామన్నారు.
శిఖండిగా మారిన కెసిఆర్ : జీవన్‌రెడ్డి
ప్రధాని మోడీకి మొగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన సిఎం కెసిఆర్ ‘ట్రాన్స్‌జెండర్’ అయ్యారని, ఢిల్లీ వెళ్లి శిఖండిలా వచ్చిరని ఎంఎల్‌సి టి.జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్నారన్నారని ఆరోపించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక అభిప్రాయమంటూ ఉండాలని, కానీ టిఆర్‌ఎస్‌కు మాత్రం ఏ అభిప్రాయం లేదని, అటు ఇటు కాకుండా ఉన్నారన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుంటే టిఆర్‌ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వబోమని ఆయన హెచ్చరి ంచారు.
కెసిఆర్ మెడుల వంచైనా ప్రతి గింజను కొనుగుల చేపిస్తాం: భట్టి
సిఎం కెసిఆర్ మెడలు వంచైనా రాష్ట్రంలోని ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. సిఎల్‌పి తరపున ఒక నెల తమ వేతనాలను రైతుల దీక్షకు అందజేస్తామని ప్రకటించారు. శ్రేయో రాజ్యం రైతుల కోసం పని చేయాలని, నష్టం వచ్చిందని పంటలను కొనుగోలు చేయబోమని చెప్పడం సిఎం కెసిఆర్ మూర్ఖత్వమన్నారు. తెలంగాణ సంగతి కెసిఆర్‌కు పూర్తిగా తెలియదని, తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగిందో ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని కెసిఆర్‌కు సూచించారు. వ్యవసాయ చట్టాలపై యూ టర్న్ తీసుకున్న సిఎం కెసిఆర్‌కు బుద్ది చెప్పాలని, టిఆర్‌ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వొద్దని పిలుపునిచ్చారు .కాంగ్రెస్ పక్షాన గ్రామ గ్రామాల్లో తిరిగి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని వ్యాపార శక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలను కల్పించిందని గుర్తు చేశారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న టిడిపి నేత చంద్రబాబును గద్దె దింపినట్టుగానే కెసిఆర్‌ను గద్దె దింపుతామన్నారు.
వ్యవసాయ చట్టాలపై కెసిఆర్ యూటర్న్
RELATED ARTICLES