l పరపతి లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు
ఆదాయం రెట్టింపు లక్ష్యానికి మిగిలింది రెండేళ్లే
న్యూఢిల్లీ: 2020 సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం మేరకు పెంచి, రూ. 15 లక్షల కో ట్లు చేయాలని ప్రభుత్వం శనివారం ప్రతిపాదించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ప్రత్యేక రైలు, విమాన సేవలను ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉద్యా న పంటల మెరుగైన మార్కెటింగ్, ఎగుమతి కోసం ‘ఒక ఉత్పత్తి ఒక జిల్లా’ను ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూమి కౌలు, వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగ్ మరియు కాంట్రాక్ట్ వ్యవసాయంపై మూడు కీలకమైన కేంద్ర నమూనా చట్టాలను త్వరగా అమలు చేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. వ్యవసాయాన్ని పోటీగా మార్చడం ద్వారా రైతుల శ్రేయస్సును నిర్ధారించవచ్చని ఆమె అన్నారు. ‘ఇందుకోసం వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ, పశువుల మార్కెట్లలో వక్రీకరణలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, సరకు రావాణా, వ్యవసాయ సేవల కోసం విపరీతమైన పెట్టుబడులు అవసరం. పశుసంపద, తేనెటీగలను పెంచే కేంద్రం, మత్స్య సంపద వంటి వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు స్థిరమైన మద్దతు అవసరమని ఆమె చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యానికి కేవలం రెండేళ్లే మిగిలి ఉన్నాయని, ఉత్తత్తి నిల్వ, ఫైనాన్సింగ్, ప్రాసెసింగ్ ,మార్కెటింగ్ వంటి సమగ్ర పరిష్కారాలను రైతులు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. మార్కెటింగ్‌ను మెరుగుపరచడానికి, పాలు, మాంసం మరియు చేపలను వంటి నశర వస్తువుల కోసం జాతీయ శీతల సరఫరా గొలుసును ని ర్మించడానికి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ఏర్పాట్ల ద్వారా – భారతీయ రైల్వే ‘కిసాన్ రైల్’ ను ఏర్పా టు చేస్తుందన్నారు. ఎక్స్‌ప్రెస్, ఫ్రైట్ రైళ్లలో రిఫ్రిజిరేటెడ్ కోచ్‌లు కూడా ఉంటాయన్నారు. జాతీ య మార్గాల్లో ‘కృషి ఉడాన్’ను పౌర విమానయాన మం త్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఇది ముఖ్యంగా ఈశా న్య, గిరిజన జిల్లాల్లో విలువ సాక్షాత్కారాన్ని(వ్యాల్యూ రి యలైజేషన్) మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మెరుగైన బ్యాంక్ పరపతి పొందేందుకు 2020- ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాలను ప్రస్తుత లక్ష్యం రూ. 13.5 లక్షల కోట్ల నుంచి రూ .15 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
సాధారణంగా, వ్యవసాయ రుణాలకు 9 శాతం వడ్డీ రేటు ఉంటుంది. కానీ రైతులకు సంవత్సరానికి 7 శాతం ప్రభావవంతమైన(ఎఫెక్టివ్) రేటుతో రూ.3 లక్షల వర కు స్వల్పకాలిక వ్యవసాయ రుణం లభించేలా ప్రభు త్వం 2 శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. వ్యవసాయ రుణాలివ్వడంలో బ్యాంకింగేతర ఆర్థిక కం పెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) , సహకార సంస్థలు చురుకుగా ఉన్నందున, నాబార్డ్ రీ ఫైనాన్స్ పథకాన్ని మరింత విస్తరిస్తామని సీతారామన్ చెప్పారు. గిడ్డంగి రసీదుల (ఇ- ఫైనాన్సింగ్ రూ .6,000 కోట్లకు పైగా దాటింది. ఇది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇనామ్)తో అనుసంధానించబడుతుంది. మరియు గిడ్డంగుల సౌకర్యాలను మరింత విస్తరించడానికి, గిడ్డంగుల అభివృ ద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (డబ్ల్యుడిఆర్‌ఎ) నిబంధనలకు అ నుగుణంగా గిడ్డంగులను రూపొందించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. / తాలూకా స్థాయిలో ఇటువంటి సమర్థవంతమైన గిడ్డంగులను ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సాధ్యతా గ్యాప్ ఫండింగ్‌అందిస్తుంది. దీనిని సాధించవచ్చు, రాష్ట్రాలు భూమి, పిపిపి మోడ్లలో ఈ సదుపాయాన్ని అందించొచ్చు’ అని ఆమె చెప్పారు.