HomeNewsBreaking Newsవ్యవసాయరంగానికి చల్లటి కబురు

వ్యవసాయరంగానికి చల్లటి కబురు

ఈసారీ సాధారణ వర్షపాతమే : ఐఎండి
న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం(ఐఎండి) దేశ వ్యవసాయరంగానికి చల్లటి కబురుచెప్పింది. ప్రస్తుత ఏడాది 2022లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అం చనా వేసింది. జూన్‌ మధ్య కాలం మొత్తం కూడా లానినా పరిస్థితులు కొనసాగనున్నాయి. దీని వల్ల సాధారణ వర్షపాతం రికార్డు కావచ్చని భారత వాతావరణశాఖ తెలిపింది. అయితే రెండు, మూడు రోజుల క్రితమే ప్రైవేటు వాతావరణశాఖ సైమేట్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం గమనా ర్హం. 2019,2020,2021లోనూ నాలుగు నెలల నైరుతి రుతుపవనాల కాలంలో దేశం లో సాధారణ వర్షాలు కురిశాయి. 2022 నైరుతి రుతుపవనాల కాలంలోనూ 96 నుంచి 104 మేరకు వర్షాలు కురుస్తాయ ని, 1971 కాలంలో సుదీర్ఘ కాల సగటు (ఎల్‌పిఎ) 87 సెంటీమీటర్లుగా ఉందని ఐఎండి తెలిపింది. అంతకు ముందు 1961 కాలంలో ఎల్‌పిఎ 88 సెంటీమీటర్లుగా ఐఎండి చెప్పింది. పరిమాణాత్మకంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగే వర్షాకాల సీజన్‌లో ఎల్‌పిఎ 99 ఉండవచ్చని, దానికి ఐదు శాతం ఇటు, ఇటుగా ఉండవచ్చని పేర్కొంది. కాగా, 40 సాధారణ వర్షపాతం, 15 అతి సాధారణ వర్షపాతం (ఎల్‌పిఎ 104 నుంచి 110 సెంటీమీటర్లు), 5 అధిక వర్షపాతం (ఎల్‌పిఎ 110 కంటే ఎక్కువ) నమోదవుతుందని వాతావరణశాఖ చెప్పింది. అదే విధంగా 26 శాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువ సంభావ్యత (ఎల్‌పిఎ 90 నుంచి 96 14 లోటు వర్షపాతం (ఎల్‌పిఎ 90 కంటే తక్కువ) రికార్డు కావచ్చని వెల్లడించింది. హిమాలయ పర్వప్రాంతాలు, వాయువ్య భారతంతో పాటు మధ్య భారతం, పెనిన్సూలార్‌ భారత్‌లోని అనేక ఉత్తరప్రాంతాల్లో సాధారణం నుంచి అతి సాధారణ వర్షాలు కురిసే అవకాశముంది. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పెనిన్సూలాలోని దక్షిణ ప్రాంతాల్లో, ఈశాన్యంలోని అనేక ప్రాంతాల్లో సాధారణ కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. భూమధ్యరేఖ పసిఫిక్‌ రీజియన్‌ వ్యాప్తంగా లా నినా పరిస్థితులు వార్షాకాల సీజన్‌ మొత్తంగా కొనసాగవచ్చు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments