న్యూఢిల్లీ/లక్నో: చైనాలో ప్రారంభమైన కరోనావైరస్(కొవిడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజల్ని గజగజలాడిస్తోం ది. ప్రస్తుతం ఈ వైరస్ భారత్‌లో కూడా తన ఉనికిని చాటుకుంటుండంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక విద్యార్థి తండ్రికి కరోనావైరస్ సోకడంతో నోయిడాలోని రెండు ప్రయివేట్ పాఠశాలలను మంగళవారం నుంచి కొన్నాళ్ల పాటు మూసేశారు. ఆ విద్యార్థి కుటుంబ సభ్యులతోపాటు అనేక మందిని క్వారంటైన్‌లో ఉంచా రు. కరోనా తాకిడికి గురైన నాలుగు ఇతర దేశాలకు విమానాలను రద్దుచేయడమేకాక, రెగ్యులర్ వీసాలను, ఇ కూడా ఇవ్వడం ఆపేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ఇటలీ పర్యాటకుడి శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంప గా, అతడికి పాజిటివ్ అని తేలింది. కాగా అతడికి నిర్వహించిన మొదటి రెండు టెస్ట్‌లు నెగటివ్ అని తేలాయి. ఇలా వైరుధ్య ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ సోమవారం తెలిపారు. ఆ ఇటలీ దేశస్థుడి భార్య శాంపిల్స్ కూడా పరీక్షించగా పాజిటివ్ అనే వచ్చింది. వైరస్ సోకిన ఆ దంపతులను జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ దంపతులు ప్రయాణించిన గ్రూపులో 21 మంది ఇటలీ పర్యాటకులు, ముగ్గురు భారతీయ పర్యాటకులు ఉన్నారు. వారందరినీ ఢిల్లీలోని ఐటిబిపి క్వారంటైన్ ఫెసిలిటీకి మంగళవారం పంపారు. ఈ వివరాలను అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు భారత్‌లో ఆరు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా వారిలో ముగ్గురు కోలుకున్నారు. సోమవారం మరో ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు తేలడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు పెరిగాయి.
కరోనావైరస్‌పై ప్రధాని మోడీ విస్తృత సమీక్ష
కరోనావైరస్‌ను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రధాని విస్తృతంగా సమీక్షించారు. ప్రజలు భయాందోళనలు చెందొద్దని, కానీ ప్రాథమిక రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని, భారత్‌లోకి ప్రవేశించేవారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన ఓ రోగి ఇటీవల ఇటలీకి ప్రయాణించాడు. అతడికి సోమవారం పాజిటివ్ అని తేలింది. అతడిని ఆదివారం రాత్రి సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ శివారులో..నోయిడాలో ఉన్న ఓ పాఠశాల ప్రాథమిక తరగతి విద్యార్థి తండ్రికి కరోనావైరస్ ఉందని తేలడంతో మార్చి 4 నుంచి 6 వరకు మూసేసింది. కానీ ఆ పాఠశాలను శనివారం వరకు మూసి ఉంచనున్నారని ఇతరులు చెప్పారు. బోర్డ్ ఎగ్జామ్స్ ఏ మాత్రం ప్రభావితం కాబోవని తల్లిదండ్రులకు పాఠశాల సందేశాలు పంపింది. నోయిడాలో ముగ్గురు బాలలు సహా ఆరుగురి శాంపిల్స్‌ను తీసుకున్నట్లు, ఎవరికైనా వైరస్ సోకిందా అని పరిశీలిస్తునట్లు నోయిడా ప్రధాన వైద్యాధికారి అనురాగ్ భార్గవ చెప్పారు. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి కుటుంబ సభ్యులను ఢిల్లీ, ఆగ్రాల్లో ఇంటికే పరిమితం చేశారు. ఆగ్రాలోని మరో ఆరుగురిని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఢిల్లీ వ్యక్తి కాంటాక్ట్‌లోకి వచిన ఇద్దరు ఆగ్రా వ్యక్తులకు కూడా కరోనావైరస్ లక్షణాలున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ వ్యక్తితో దాదాపు 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని, వారిలో 13 మంది రిపోర్టులు అందినట్లు తెలిపింది. ఆరుగురికి కరోనావైరస్ ఉందని అనుమానిస్తున్నారు. వారి శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ ఆరుగురిని ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సిడిసి)కి పంపిన 10 శాంపిల్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
వైరస్ అలజడి
RELATED ARTICLES