ప్రజాపక్షం/హైదరాబాద్ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నేపథ్యంలో వైన్స్ దుకాణాల వద్ద ఆకతాయిలు ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తున్నారని, దుకాణాల తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ వైన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ వైన్స్ అసోసియేషన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి లేఖ రాసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నేపథ్యంలో వైన్స్ దుకాణాలు మూసివేయబడ్డాయని, గత కొన్ని రోజుల నుంచి మద్యం లభించకపోవడంతో దొంగలు మద్యం షాపులను ధ్వంసం చేస్తున్నారని తెలిపింది. మద్యానికి బానిస అయిన కొంతమంది మద్యం షాపుల తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. దయచేసి ఇ ఈ లోకల్ పోలీస్ లేదా పెట్రోలింగ్ పోలీస్ అధికారుల ద్వారా మద్యం షాపుల దగ్గర ఎవరైనా కనిపిస్తే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ వైన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.
వైన్స్ షాఫుల తాళాలు పగలగొడుతున్నారు!
RELATED ARTICLES