HomeNewsTelanganaవైద్యానికి అధిక ప్రాధాన్యత

వైద్యానికి అధిక ప్రాధాన్యత

అన్ని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
ప్రజాపక్షం/ సూర్యాపేట వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర నీటి పారులదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిజిహెచ్‌ ఆసుపత్రి ఆవరణలో నిర్మిచ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ, టీచింగ్‌ ఆసుపత్రి స్థల పరిశీలన తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా, మౌలిక వసతుల కల్పించనున్నట్లు తెలిపారు. సర్వే నెంబర్‌ 765 అండర్‌ 766లలోని 5 ఎకరాల 8.5 గుంటల స్థలంలో రూ. 190.50 కోట్లతో చేపట్టే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, టీచింగ్‌ ఆసుపత్రి పనులు సత్వరమే చేపట్టాలని డిజెపిఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అధిపతి శశిభూషన్‌ను, అలాగే సంబంధిత అధికారులను ఆదేశించారు. పక్కనే ఉన్న పాత పాలిటెక్నిక్‌ కళాశాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్‌ పర్యవేక్షకులు డాక్టర్‌ మురళిధర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శారద, ఈఈఎంఏ అజిజ్‌, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, డిఎస్పి రవి తదితరులు ఉన్నారు.
మహిళలకు భరోసా సెంటర్‌తో న్యాయం జరగాలి
భరోసా కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయం జరగాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం సుపెన్‌ ఫార్మా కంపెనీ సమీపంలో పోలీస్‌, సుపెన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్‌, షీ టీమ్స్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్‌ ఏర్పాటు చేసిన పోలీసు, భాగస్వామ్యంతో సువెన్‌ ఫార్మాను అభినందించారు. మహిళలు, బాలలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల రక్షణ చట్టాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి నిర్మూలనలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను సూచించారు. మహిళలపై వేధింపులు, హత్యాచారాలు, దాడులు, నిరాధరణకు గురైన బాధిత మహిళలు, పిల్లలకు ఒకే చోట కేసుల నమోదు, వైద్యం, న్యాయ, మానసిక ధైర్యం, అవసరమైన పిల్లలకు విద్యా వసతి, పునరావాసం, కౌన్సిలింగ్‌ ఇవ్వడం, కోర్టుల విషయాలు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పించడం మంచి ఆలోచన అన్నారు. మహిళల రక్షణలో పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భరోసా సెంటర్‌, షీటీం పని తీరు, చట్టాల అమలుపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలను నిరోధించడంలో పోలీసు శాఖ నిరంతర కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్దె భరోసా సెంటర్‌ లక్ష్యం, ఉద్దేశంను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్దే, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సువెన్‌ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments