తొలి టి20 హైదరాబాద్‌లో చివరిది ముంబయిలో..
ముంబయి : వచ్చే నెలలో టీమిండియా-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగే టీ20 మ్యాచ్ వేదికల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు టీ20ల ఈ సిరిస్‌లో రెండు మ్యాచ్‌ల వేదికలను మార్చారు. ఈ మేరకు తాజా షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6న జరిగే తొలి టీ20కి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంది. ఇక, రెండో మ్యాచ్ డిసెంబర్ 8న తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ డిసెంబర్ 11న హైదరాబాద్‌లో జరగాలి. ముంబైలో జరగాల్సి తొలి టీ20ని భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌కు మార్చారు. అలాగే డిసెంబర్ 11న హైదరాబాద్‌లో జరగాల్సిన మూడో టీ20ని ముంబైకి తరలించారు. డిసెంబరు 6 బాబ్రీ కూల్చివేత రోజు. దీంతో పాటు అంబేద్కర్ వర్ధంతిన జరుపుకొనే ’మహాపరినిర్వాన్ దినోత్సవం’ కూడా అదేరోజు కావడంతో వాంఖడేలో జరిగే మ్యాచ్‌కు భద్రత కల్పించలేమంటూ ముంబై పోలీసులు స్పష్టం చేశారు. దీనికి తోడు ఇటీవలే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలాంటి తరుణంలో డిసెంబర్ 6న అదనపు బలగాలను మొహరించాల్సిన అవసరం ఉండొచ్చని మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టతరమని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో తొలి టీ20ని హైదరాబాద్‌కు, మూడో టీ20ని ముంబైకి మార్చారు.
వేదికలు తారుమారు
RELATED ARTICLES