టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే అందుకు సంబంధించిన పత్రాలు సరిగ్గా సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఈసారి సరైన పత్రాలు సేకరించుకున్న తర్వాత శని లేదా ఆదివారాల్లో మళ్లీ తాను నామినేషన్ దాఖలు చేస్తానని ఈ వేణుమాధవ్ తెలిపారు. తన స్వస్థలం కోదాడ కావడంతో వేణుమాధవ్ అక్కడినుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ
RELATED ARTICLES