చెలరేగిన ఎవిన్‌లెవీస్, మూడో టి20 బంగ్లాదేశ్ చిత్తు
మీర్పుర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్ 2 గెలుచుకుంది. వరుస పరాజాయాలతో సతతమతమవుతున్న విం డీస్ చాలా కాలం తర్వాత విదేశంలో సిరీస్ దక్కించుకుంది. అంతకుముందు టెస్టు, వన్డే సిరీస్‌లను బంగ్లాదేశ్ విజయం సాధించగా.. తాజాగా టి20 సిరీస్‌ను కరీబియన్ జట్టు కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన విండీస్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ ఎవిన్ లెవీస్ (89; 36 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో విండీస్ జట్టు 19.2 ఓపెనర్లలో 190 పరుగులుకు ఆలౌటైంది. తర్వాత భారీ ల క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కీమో పౌల్ (5/15) ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో విండీస్‌కు 50 పరుగుల ఘన విజయం లభించింది. 191 పరుగుల బారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (8) రన్నౌటయ్యాడు. తర్వాత సౌమ్య సర్కార్ (9), కెప్టెన్ సాకిబుల్ హసన్ (0)లను ఫాబిన్ అలెన్ పెవిలియన్ పంపాడు. ఆ వెంటనే ముష్ఫికుర్ రహీం (1)ను కీమో పౌల్ తెలివైన బంతితో ఔట్ చేయడంతో బంగ్లా 66 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. రెండు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు ఓపెనర్ లిటన్ దాస్ చెలరేగి ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఇతనికి అండగా నిలిచిన మహ్మదుల్లా (11)ను కీమో పౌల్ అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. తర్వాత బంగ్లా జట్టు స్కోరు 89 పరుగుల వద్ద విజృంభించి ఆడుతున్న లిటన్ దాస్ 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి కీమో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో అబు హైదర్ (17 బంతుల్లో 22) దూకుడుగా ఆడిన లభంలేక పోయింది. కీమో పౌల్ ధాటికి బంగ్లా ఇన్నింగ్స్ 17 ఓవర్లలో 140 పరుగులకే ముగిసింది. కీమో పౌల్ నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో అలెన్‌కు రెండు, బ్రాత్‌వైట్, షెల్డన్‌కు తలొక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ ఎవిన్ లెవీస్ విధ్వంసకర ఆరంభాన్నిచ్చాడు. మొదటి నుంచే చెలరేగి ఆడుతూ బౌండరీల సునామీ సృష్టించాడు. ఇతని ధాటికి మైదానం నలుమూలల బౌండరీల వరద పారింది. ఈ క్రమంలోనే ఎవిన్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ కూడా దూకుడుగా ఆడడంతో విండీస్ తొలి ఐదు ఓవర్లలోనే 76 పరుగులు చేసింది. అయితే అదే స్కోరువద్ద షై హోప్ (23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సాకిబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కీమో పౌల్ (2) పరుగులకే ఔటయ్యాడు. మరోవైపు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్న ఎవిన్ లెవీస్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసి మహ్మదుల్లా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో విండీస్ 9.2 ఓవర్లలో 122 పరుగుల వద్ద మూడో కీలకమైన వికెట్ కోల్పోయింది. తర్వాత పుంజుకున్న బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ విండీస్‌ను కట్టడి చేశారు. వరుసక్రమంలో వికెట్లు తీస్తూ పోవడంతో పరుగుల వేగం మందగించింది. తర్వాత రోవ్‌మన్ పొవెల్ (19), నికొలాస్ పూరన్ (29) మినహా మిగతా బ్యాట్స్‌మన్లు రెండంకెళ స్కోరు మార్కును దాటకపోవడంతో వెస్టిండీస్ జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో సాకిబుల్ హసన్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో మూడు వికెట్లు తీశారు. విజృంభించి ఆడిన ఎవిన్ లెవీస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సిరీస్‌లో ఆల్ రౌండర్‌గా రాణించిన బంగ్లాదేశ్ సారథి సాకిబుల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
వెస్టిండీస్‌కు సిరీస్
RELATED ARTICLES