తెలుగు చిత్ర పరిశ్రమలో వయసుకు తగిన, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ఇటీవల ‘దృశ్యం2’తో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేశ్ ఓ వెబ్ సిరీస్‌లో నటించున్న సంగతి తెలిసిందే? నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో రానాతో కలిసి తెర పంచుకోనున్నారు వెంకీ. సోమవారం వెంకీ పుట్టిన రోజు సందర్భంగా వెబ్‌సిరీస్‌లో వెంకటేశ్‌కు పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. నెరిసిన జుట్టు, గడ్డం, చెవికి పోగుతో కనిపించిన ఆయన స్టిల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో వెంకటేశ్ రానానాయుడు అనే పాత్ర పోషిస్తున్నారు. ఎవరిదో పాస్‌పోర్ట్ ఫొటో పట్టుకుని ఆచూకీ కోసం వెతుతున్న వ్యక్తిలా ఇందులో ఆయన కనిపించారు. వెంకీ వెతికే ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం వెంకటేశ్ ‘ఎఫ్ 3’ సినిమాతో బిజీగా ఉన్నారు.
వెబ్‌సిరీస్ నుంచి వెంకీ ఫస్ట్‌లుక్!
RELATED ARTICLES