తీవ్రంగా ఖండించిన వామపక్షాలు
హైదరాబాద్: వెనిజులాలో ప్రజాప్రభుత్వా న్ని కూల్చేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని వామప క్షపార్టీలు మండిపడ్డాయి. వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చి ప్రతిపక్ష నాయకుడిని అధికారం అప్పగించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టాయి. అమెరికా సా మ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వెనిజులాలో అమెరికా ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌లో నిరస న ప్రదర్శన నిర్వహించి ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చే శారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వెనిజులా దేశంపై అమెరికా చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన అవస రం ఉందన్నారు. ప్రపంచంలో అమెరికా పెత్తనం రోజు రోజుకు పెరిగిపోతోందని, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత కంపు కొట్టిస్తున్నాడని, ఇతర దేశాల పాలనలో జోక్యం చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. గతంలో లాటిన్ అమెరికాలోని అనేక దేశాలపై, అరబ్ దేశాలపై పెత్తనం చేస్తూ ఆయిల్ ఉత్పత్తిని తమ చేతుల్లో తీసుకొని ప్రపంచంపై పెత్తనం చలాయించడానికి చేసిన ప్రయత్నాలను ఆయన గుర్తుచేశారు. ఇప్పడు వెనిజులా లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడిని అధ్యక్షుడిగా గుర్తిస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రకటన చేసిందన్నా రు. వెనిజులాకు ఎవరు అధ్యక్షుడో ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారన్నారు. వెనిజులా అంతర్గత వ్యవహారా ల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఇప్పటికే రష్యా, చైనా, క్యూబా వంటి అనేక దేశాలు ట్రంప్ ప్రభుత్వ చర్య ల్ని ఖండించాయని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వెనిజులాపై దాడులను అక్రమ జోక్యాన్ని నిరసిస్తూ వెనిజులా ప్రభుత్వానికి అండదండలు అందించే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భా రత ప్రభుత్వం వెనిజులా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మ ద్దతివ్వకపోతే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వెనిజులాలో ప్రజాతంత్రం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరుచడానికి అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేస్తోందన్నారు. ఆ దేశ ప్రజలు కా వాలనుకుంటే అధ్యక్షుడిని దించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని, అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ రకమైన కుట్ర వెనిజులాకే పరిమితం కాదని లాటిన్ అమెరికాలో వామపక్ష ఉద్యమాలను అస్థిర పరిచే కుట్రలు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయ ని అన్నారు. భారత ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. వెనిజు లా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని మోడీ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌యుసిఐ నాయకుడు ము రళి మాట్లాడుతూ ట్రంప్ నాయకత్వంలో ప్రపంచంలోని చిన్న దేశాలపై దాడి జరుగుతోందన్నారు. అమెరికా ప్రజాతంత్ర విలువలను సర్వనాశనం చేస్తోందని దుయ్యబట్టారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకుడు గో వర్ధన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహంగా పనిచేస్తుందని ఆరోపించారు. వెనిజులా ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని యావత్ ప్రపంచం ఖండించాలన్నారు. కెసిఆర్ కూడా తన విధానమేమిటో తెలుపాలని డిమాండ్ చేశా రు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ వెనిజులాకు సంబంధించిన చము రు సంస్థలను అస్థిర పరుచడానికి అమెరికా ప్రయత్నిస్తుందన్నారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు రాజిరెడ్డి మాట్లాడుతూ అమెరికా వెనిజులాపైనే కాదు ప్రపం చ పోలీసుగా ఇరాన్, ఇరాక్, సిరియా వంటి అనేక దేశా ల్లో జోక్యం చేసుకుందన్నారు. అరుణోదయ సాంస్కృతి క సంస్థ నాయకురాలు విమలక్క మాట్లాడుతూ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు సృష్టిస్తున్నాడ ని విమర్శించారు. వెనిజులా సార్వభౌమత్వానికి ప్రతి ఒ క్కరు అండగా నిలువాలని కోరారు. పిఒడబ్ల్యు నాయకురాలు సంధ్య మాట్లాడుతూఅమెరికా కుట్రలు కొత్త కాదన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర
RELATED ARTICLES