న్యూఢిల్లీ: ప్రతిసారి లాగే ఈసారి కూడా టీమిండియాకు బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. ఎన్నో ఆశలు, ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన కోహ్లీ సేనకు బ్యాటింగ్ సమస్య విపరీతంగా వెంటాడుతోంది. గత పర్యటనలతో పోలిస్తే ఈసారి జట్టు పటిష్టంగా ఉందని అందురూ భావించారు. కానీ, భారత బ్యాట్స్‌మన్లు అందరి అంచనాలను తారుమారు చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఘోర ఫలితాలను మూటగట్టుతున్నారు. పర్యటనకు ముందు స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో వరుస విజయాలు సాధించి తమకు ఎదురులేదని నిరూపించిన టీమిండియా విదేశంలో అడుగు పెట్టగానే అవే పాత కథను పునారావృతం చేస్తోంది. ఆస్ట్రేలియా బి టీమ్‌ను సైతం తట్టకోలేకపోతుంది. ఒకరిద్దరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలతో భారత జట్టు సిరీస్ గెలవడం కష్టమనే చెప్పాలి. కలిసి కట్టుగా రాణిస్తేనే విజయాలు సాధించగలుగుతాం. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు ఏర్పరిచి జట్టును ఆదుకోవాల్సిన అవసం ఎంతైనా ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడితే ఫలితాలు మాత్రం శూన్యం. ఈ టెస్టు సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. ఒకరిద్దరు మినహా మిగతా బ్యాట్స్‌మన్స్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోతుంటే.. మరోవైపు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా భారీ భాగస్వామ్యాలు ఏర్పర్చడంలో విఫలమవుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నారు. చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అయితే 10 15 పరుగుల వ్యవధిలోనే టపటపవికెట్లను చేజార్చుకుంటూ పేలవమైన ఆటను ప్రదర్శిస్తున్నారు. బ్యాట్స్‌మన్లు ఇంతగా విఫలమవుతుంటే బ్యాటింగ్ కోచ్ ఏం చేస్తున్నాడు. అతని పాత్ర ఎంటనేది సందేహంగా మారింది. రెండు టెస్టులలోనూ దాదాపు బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. తొలి టెస్టును కష్టపడి నెగ్గిన టీమిండియా రెండో టెస్టును కోల్పోయింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు చెరోవిజయంతో సమానంగా ఉన్నారు. మెల్‌బొర్న్ వేదికగా ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు భారత్‌కు కీలకమైంది. ఈ టెస్టులో గెలిస్తేనే పోటీలో నిలబడగలుగుతోంది. సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోగలదు. ఇప్పటివరకు జరిగిన తప్పులను సరిదిద్దుకొని తర్వాతి టెస్టులో భారత జట్టు మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్దాం.
వెంటాడుతున్న బ్యాటింగ్ సమస్య…
RELATED ARTICLES