గీత వృత్తిలో నూతన ఒరవడి అవసరం
కల్లు మత్తుపానీయం కాదు ఆహారంలో ఒక భాగం
గీత పనివారల రాష్ట్ర సదస్సులో వి.వినోద్‌కుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్ : కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా వృత్తుల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ అన్నారు. అందులో భాగంగా కల్లుగీత వృత్తిలోనూ నూతన ఒరవడి అవసరమని అన్నారు. కల్లు మత్తు పానీయం కాదని, అది ఆహారంలో ఒక భాగమని, ఈ వృత్తిలో వస్తున్న సమ్యలను అధిగమించడానికి శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గీత పనివారల రాష్ట్ర సదస్సు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బి. వినోద్ కు మార్ ముఖ్య అతిథిగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెం కట్‌రెడ్డి విశిష్ఠ అతిథిగా, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, తెలంగాణ గౌడ ఐక్యవేదిక కమిటి రాష్ట్ర అధ్యక్షులు అం బాల నారాయణ గౌడ్ వృత్తి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు ప్రసంగించారు. గీత పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బి.వినోద్ కు మార్ మాట్లాడుతూ తాటి, ఈత చెట్లపై ఎక్కి కల్లు గీయడాన్ని సులభతరం చేయడం, గీసిన కల్లును మార్కెటింగ్ ఎలా చేయాలనే దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కల్లు అనేది ప్రకృతి సిద్ధ్దమైన పానీయమని దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగాలన్నారు. ప్రతి సమస్యకు శాస్త్రీయ పరిష్కారం ఉంటుందని, దానిని కునుగోవాల్సిన అవసరం ఉందన్నారు. కల్గుగీతలోనూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరమన్నారు. కాలానుగుణంగా వృత్తిరీత్యా మా ర్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నగరంలో కల్లు పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారని గు ర్తు చేశారు. హరితహారంలో ఈత, తాటి మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని ము ఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో చర్చించి కల్లుగీత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో జాప్యం పరుగకుండా వెంటనే ని ధులు విడుదల చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, గీత పనివారల సంఘం అందించిన డిమాండ్ల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మా ట్లాడుతూ దున్నే వాడిదే భూమి, గీసే వానిదే చెట్టు అనే నినాదంతో నాడు ధర్మ బిక్షం పోరాటం చేశారని గుర్తు చేశారు. కల్లు గీయడానికి చెట్టు ఎక్కాల్సిందేనని, అయితే చెట్లు ఎక్కడా న్ని సులభతరం చేసే ప్రక్రియ ను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. వృత్తితోనే బ తుకు తెరువు అని ఆ వృ త్తి నేడు చితికిపోయే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ భూము ల్లో ఈత, తాటి చెట్ల వనా లు పెంచాలని ఆయన అన్నా రు. గీత వృత్తి నిలబడాలంటే వనాలను పెంచాలని ఇందుకోసం కృషి చేయాలని ఆయన వినోద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌గ్రేషియా వెం టనే చెల్లించేలా చూడాలని, బడ్జెట్ రూ పకల్పనలో గ్రామీణ చేతివృత్తులకు ప్రాధాన్యత నివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు భ్రష్టు పట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విలువలను కాపాడాల్సిన అవస రం ఉందన్నారు. గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో కల్లుపై నిషేధాన్ని ఎత్తివేసిందని, పాత బకాయిలను రద్దు చేసిందని తెలిపారు. బొమ్మగాని ప్రభాకర్ అ ధ్యక్షోపన్యాం చేస్తూ ఎక్స్‌గ్రేషి యా బకాయిలు పేరుకు పోయాయని, వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ధర్మబిక్షం నేతృత్వంలో గీత కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, సదుపాయాలు ఆచరణకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశా రు. హరాజ్ విధానం రద్దు సా ధించుకున్నామన్నారు. ప్రభుత్వం చేసే మంచి నిర్ణయాలను స్వాగతించామని, అన్యా యం జరిగితే అదే గొంతుతో తిరుగుబాటు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెండింగ్ ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలని, కల్లుగీత సొసైటీలు బలపడేలా ప్రతి సొసైటీకి పది ఎకరాలు కేటాయించాలని వనం మీద హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్మబిక్షం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో పెండింగ్ ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వృత్తిదారుల సంఘం నేత టి.వెంకట్రాములు, బిసి హక్కుల పోరాట సమితి కార్యదర్శి ఆర్.పాండురంగా చారి) ప్రసంగించారు. గీత పనివారల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరి కెవిఎల్ వందన సమర్పణ చేశారు. గీతపనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడ ఐలయ్య గౌడ్, జి.శ్రీరాములు, కొండా కోటయ్య, కోశాధికారి బి.నాగభూషణం, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, గీత పనివారల సంఘం వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వివిధ కుల వృ త్తుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.