సైనిక లాంఛనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు
ఎగువరేగడి గ్రామంలో అలముకున్న విషాదఛాయలు
కురబలకోట : సైనిక లాంఛనాల మధ్య లాన్స్ నాయక్ సాయి తేజ అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామమైన చిత్తూరు జిల్లా, కురబలకోట మండలం, ఎగువరేగడి గ్రామం లో ముగిశాయి. ఈనెల ఎనిమిదవ తేదీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయినటువంటి లాన్స్ నాయక్ వీర జవాన్ సాయి తేజ పార్థివ దేహానికి బరువెక్కిన హృదయాల మధ్య పట్టణ ప్రజ లు అడుగడుగున నీరాజనం పలుకుతూ రహదారుల వెంబడి కన్నీటి బిందువులతో పర్యంత్యామయ్యారు. బెంగళూరు నుం డి వయ పుంగనూరు మీదుగా వీర జవాన్ సాయితేజ పార్థివదేహం ఉదయం పదిగంటలకి పట్టణంలోకి చేరుకోగా ప్రజలు, అన్ని రాజకీయ నాయకులు, ఉద్యోగులు వివిధ సంఘాలు యువత కలిసి పెద్ద ఎత్తున వీర జవాన్ సాయి తేజ పార్థివ దేహానికి స్వాగతం పలకడానికి పార్థివ దేహం కోసం ఎదురుచూశారు. లాన్స్ నాయక్ సాయితేజ పార్థవదేహం ఆదివారం ఉదయం బెంగుళూరు నుండి మదనపల్లి పట్టణానికి చేరుకున్న పార్థివదేహానికి పట్టణానికి చెందిన వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులు, అధికారులు,బైక్ ర్యాలీలు, సాయి తేజ్ అమర్ హై అంటూ ర్యాలీ మదనపల్లి నుండి సుమారు 20 కిలోమీటర్లు ఉన్న ఎగువ రేగడ పల్లె స్వగ్రామానికి మధ్యాహ్నం చేరుకోవడంతో చుట్టుపక్కల గ్రామస్థులు సాయి తేజ్ పార్థవదేహం రాకతో ఒక్కసారిగా దుఃఖంతో చివరి చూపుకోసం ఎదురు చూశారు. సాయి తేజ తల్లిదండ్రులు, మోహన్, భువనేశ్వరి, తమ్ముడు మహేష్, భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞా, కూతురు దర్శిని, వీరి బాధన చూసి ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. రేగడపల్లె గ్రామంలో సాయి తేజ్‌కు పోలీసులు ప్రభుత్వ అధికార లాంఛనాలతో గాలిలో తుపాకీ కాల్పుల దహన క్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసి వెంకటేశ్వర్ చిత్తూరు, ఎస్‌పిలు సింథిల్ కుమార్, వెంకట అప్పల నాయుడు, మదనపల్లి, కురబలకోట మండలాల తహశీల్దార్లు, సైన్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వీరజవాన్ సాయితేజకు కన్నీటి వీడ్కోలు
RELATED ARTICLES