సూర్యాపేట జిల్లాలో కారు పల్టీ కొట్టి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం, మరో నలుగురికి తీవ్ర గాయాలు
ప్రజాపక్షం/సూర్యాపేట: విహారయాత్ర విషాదంగా మారింది. బాపట్ల నుండి హైదరాబాద్‌కు వస్తున్న కారు సూర్యాపేట జిల్లాలో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, ఒకరు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు (ఎర్టిగా) కార్లలో 16 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి వస్తూ మార్గ మధ్యలో విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కారు మునగాల దగ్గరకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఉన్నవారు అంతా చల్లా చెదురుగా పడ్డారు. హర్ష, రేవంత్ అక్కడకక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ శశాంక్ మృతి చెందాడు. ప్రణీత్, హసీఫ్, అజయ్, నిఖిల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మరో విద్యార్థి ఈశ్వర్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. వీళ్లంతా హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు.
విహారయాత్రలో విషాదం
RELATED ARTICLES