హాకీ ప్రపంచకప్ ఫైనల్లో నెదర్లాండ్స్ ఓటమి
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో బెల్జియం విశ్వ విజేతగా అవతరించింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో బెల్జియం 3- తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మొదట మ్యాచ్ పూర్తి సమయం ముగిసే సరికి రెండు జట్లు (0- ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. దీంతో షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో ప్రపంచ మూడో ర్యాంక్ బెల్జియం (3 గోల్స్‌తో ప్రపంచ నాలుగో ర్యాంక్ నెదర్లాండ్స్‌ను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. బెల్జియం తొలి సారిగా ప్రపంచకప్ టైటిల్ సాధించింది. మరోవైపు ప్రపంచకప్ నెగ్గిన ఆరో జట్టుగా కొత్త ఆధ్యాయనం లిఖించుకుంది. రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ రజతంతో సరిపెట్టుకుంది.
ఆస్ట్రేలియాకు కాంస్యం…
అంతకుముందు కాంస్యం కోసం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 8- గోల్స్ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రలియా కొత్త రికార్డును సృష్టించింది. హాకీ ప్రపంచకప్‌లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచుల్లో తాజాగా ఆసీస్ సాధించిన 8 గోల్సే అత్యధికం కావడం విశేషం. మొదటి నుంచి దూకుడైన ఆటను ప్రదర్శించిన ఆస్ట్రేలియా వరుసక్రమాల్లో గోల్స్ చేస్తూ పోయింది. 8వ నిమిషంలోనే తొలి గేమ్ సాధించిన ఆసీస్ 60వ నిమిషం వరకు మొత్తం 8 గోల్స్ నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో క్రెగ్ టామ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. క్రెగ్ టామ్ (9వ, 19వ, 34వ) నిమిషాల్లో వరుసగా గోల్స్ చేశాడు. కాగా.. హేవర్డ్ జెర్మి (57వ, 60వ) నిమిషాల్లో గోల్స్ చేసి తన ఖాతాలో రెండు గోల్స్ వేసుకున్నాడు. మరోవైప ఇంగ్లాండ్ తరఫున మిడిల్‌టన్ బారీ 45వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు.
విశ్వ విజేత బెల్జియం
RELATED ARTICLES